Suicide : బెంగుళూరులో వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య‌.. సూసైడ్ నోట్‌లో బీజేపీ ఎమ్మెల్యే పేరు..!

బెంగుళూరులో 47 ఏళ్ల వ్యక్తి తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు సూసైడ్ నోట్‌లో భారతీయ జనతా

Published By: HashtagU Telugu Desk
Student's suicide at Tirumala school... Here is the actual truth...

Student's suicide at Tirumala school... Here is the actual truth...

బెంగుళూరులో 47 ఏళ్ల వ్యక్తి తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు సూసైడ్ నోట్‌లో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేతో సహా ఆరుగురి వేధింపులే వ‌ల్లే తాను ఆత్మ‌హ‌త్య చేసుకున్నాన‌ని పేర్కొన్నాడు. ఎస్ ప్రదీప్ అనే వ్యక్తి 2018లో బెంగళూరులోని ఒక క్లబ్‌లో రూ. 1.2 కోట్లు పెట్టుబడి పెట్టాడు. క్లబ్‌లో పనిచేసినందుకు జీతంతో సహా ప్రతి నెలా రూ. 3 లక్షలు తిరిగి చెల్లిస్తానని పార్ట్‌న‌ర్‌లు హామీ ఇచ్చారు. అయితే, డబ్బులు తీసుకున్న తర్వాత గోపి, సోమియా అనే ఇద్దరు వ్యక్తులు ప్రదీప్‌కు తిరిగి చెల్లించేందుకు నెలల తరబడి నిరాకరించారని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. వడ్డీ చెల్లించేందుకు ప్రదీప్ పలుమార్లు అప్పులు చేయాల్సి వచ్చిందని.. చెల్లింపులు చేసేందుకు తన ఇల్లు, వ్యవసాయ భూమిని కూడా విక్రయించాల్సి వచ్చిందని నోట్‌లో పేర్కొంది.

ఎన్నిసార్లు విన్నవించినా ఆ వ్యక్తులు ప్రదీప్‌కు డబ్బు తిరిగి ఇవ్వలేదని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. దీంతో ప్రదీప్ ఈ విషయాన్ని బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ లింబావలి వద్దకు తీసుకెళ్లినట్లు నోట్‌లో పేర్కొన్నారు. ప్రదీప్ డబ్బును తిరిగి ఇవ్వాలని ఎమ్మెల్యే ఇద్దరు వ్యక్తులతో మాట్లాడారని, అయితే వారు కేవలం రూ.90 లక్షలు మాత్రమే తిరిగి ఇస్తామని చెప్పారని అందులో పేర్కొంది. ప్రదీప్ సోదరుడి ఆస్తిపై జయరాంరెడ్డి అనే వైద్యుడు సివిల్ కేసు పెట్టాడని, ప్రదీప్‌ను మానసికంగా హింసించి వేధిస్తున్నాడని లేఖలో ఆరోపించారు. బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ లింబావలీ కూడా త‌న‌కు డ‌బ్బులు ఇవ్వ‌ని వ్యక్తులకు మద్దతు ఇస్తున్నారని సూసైడ్ నోట్‌లో తెలిపారు. బెంగళూరులోని నెట్టిగెరె గ్రామంలో తలకు బుల్లెట్ గాయంతో ప్రదీప్ చనిపోయాడు. అతని కారులో సూసైడ్ నోట్ లభించిందని, అందులో బీజేపీ ఎమ్మెల్యే సహా ఆరుగురి పేర్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. పోలీసు అధికారులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.

  Last Updated: 02 Jan 2023, 11:35 AM IST