311 Traffic Violations: ట్రాఫిక్ రూల్స్ అంటే అతడికి లెక్క లేదు. అడ్డదిడ్డంగా టూ వీలర్‌ను నడపడం తన జన్మహక్కు అని భావించాడు. ఎక్కడపడితే అక్కడ.. ఎలా పడితే అలా ట్రాఫిక్ రూల్స్‌ను బ్రేక్ చేశాడు. దీంతో 2023 సంవత్సరం ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు ఆ వ్యక్తిపై ఏకంగా 311 ట్రాఫిక్ ఉల్లంఘన(311 Traffic Violations) కేసులు నమోదయ్యాయి. ఒక్క సోషల్ మీడియా పోస్ట్ కారణంగా అతగాడిని ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. వివరాలు చూద్దాం..
Also Read :Gaza Strip : గాజాను మా ఆధీనంలోకి తీసుకుంటాం.. ట్రంప్ సంచలన ప్రకటన
వెలుగులోకి తెచ్చిన ఒక నెటిజన్
అతడి పేరు సుదీప్. బెంగళూరు నగర వాస్తవ్యుడు. ట్రాఫిక్ ఉల్లంఘనలు ఎన్ని రకాలు ఉంటాయో.. అన్ని రకాలుగా అతడు ఉల్లంఘనలకు పాల్పడ్డాడు. దీంతో 311 ట్రాఫిక్ కేసులు నమోదయ్యాయి. రూ.1.61 లక్షల జరిమానా కట్టాల్సి ఉంది. సుదీప్ ఇంటికి నోటీసులు పంపినా.. నో రెస్పాన్స్. ట్రాఫిక్ పోలీసులు కూడా సుదీప్‌ను పట్టుకోవడంపై పెద్దగా ఫోకస్ పెట్టలేదు. కానీ శిబం అనే వ్యక్తి పెట్టిన సోషల్ మీడియా (ఎక్స్) వేదికగా పెట్టిన ఒక పోస్ట్ వైరల్ అయింది. ఆ పోస్ట్‌లో సుదీప్ చేసిన ట్రాఫిక్ ఉల్లంఘనల వివరాలు, అతడిపై పడిన జరిమానాల చిట్టా ఉంది. 311 ట్రాఫిక్ కేసులను ఎదుర్కొంటున్న ఉల్లంఘనుడు సుదీప్ అనే విషయాన్ని శిబం వెలుగులోకి తెచ్చాడు.
Also Read :Cow Dung : ఆవుపేడను కొనేందుకు ఈ దేశాల క్యూ.. ఎంత ధర ?
నెటిజన్లు ఫైర్.. పోలీసులు యాక్టివ్
దీన్ని చూసి నెటిజన్లు ఫైర్ అయ్యారు. అలాంటి వ్యక్తిని ఇంకా ఎందుకు పట్టుకోలేదని బెంగళూరు నగర ట్రాఫిక్ పోలీసులను నిలదీశారు. దీంతో బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు యాక్షన్ మోడ్‌లోకి వచ్చారు. సుదీప్ టూవీలర్ యాక్టివిటీని ట్రాక్ చేశారు. బెంగళూరు నగరంలోని ఒక ట్రాఫిక్ సిగ్నల్ వద్ద టూవీలర్‌పై సుదీప్ వెళ్తుండగా.. సిటీ మార్కెట్ ట్రాఫిక్ పోలీసులు చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరి 3న (సోమవారం) సుదీప్‌ను పట్టుకున్నట్లు వెల్లడించారు. సుదీప్ రూ.1,61,500 జరిమానా బకాయి ఉండగా.. అంత డబ్బు లేదని చెప్పాడు. దీంతో ఎలాగోలా సుదీప్‌తో రూ.1,05,500 జరిమానా కట్టించుకున్నారు. మిగతా రూ.50వేల కింద అతడు నడుపుతున్న టూవీలర్‌ను జప్తు చేశారు. సుదీప్ వాడుతున్న టూ వీలర్ పెరియ స్వామి అనే వ్యక్తి పేరుతో ఉంది. దీంతో పెరియ స్వామికి కూడా లీగల్ నోటీసులను పంపారు.