Site icon HashtagU Telugu

30 Elephants Entry : 30 ఏనుగుల ఎంట్రీ.. పది గ్రామాల్లో హై అలర్ట్

30 Elephants Entry

30 Elephants Entry

30 Elephants Entry : ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 30 ఏనుగులు కర్ణాటక బార్డర్‌లోని అడవుల నుంచి తమిళనాడులోని డెంకనికోట్టై రిజర్వ్ ఫారెస్టులోకి ప్రవేశించాయి. డెంకనికోట్టై రిజర్వ్ ఫారెస్టు..  హోసూరు పట్టణం సమీపంలో ఉంది.  30 ఏనుగుల ఎంట్రీ నేపథ్యంలో డెంకనికోట్టై రిజర్వ్ ఫారెస్టు పరిసర గ్రామాలను అటవీ శాఖ అధికారులు అలర్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఏనుగులు సానమావు – నొకనూర్  అటవీ ప్రాంతంలో ఉన్నాయని గుర్తించారు. అవి గ్రామాల్లోకి ఎంటరయ్యే అవకాశం ఉన్నందున.. అటవీ పరిసరాల్లోని పల్లెల ప్రజలు అలర్ట్‌గా ఉండాలని అధికారులు సూచించారు. ఏనుగుల కదలికలను తాము ట్రాక్ చేస్తున్నామని చెప్పారు.

Also Read: CBI Cases Vs DKS : డీకే శివకుమార్‌‌కు సిద్ధరామయ్య గుడ్ న్యూస్

ఏదిఏమైనప్పటికీ అడవికి ఆనుకొని ఉన్న సానమావు, బీర్జేపల్లి, రామాపురంతోపాటు 10కిపైగా గ్రామాల ప్రజలు, రైతులు సురక్షితంగా ఉండాలని అటవీశాఖ హెచ్చరికలు జారీ చేశారు. ఆయా పల్లెల ప్రజలు అటవీ ప్రాంతానికి సమీపంలోని పొలాల్లో సురక్షితంగా పనిచేయాలని కోరారు. రాత్రి వేళల్లో అడవుల వైపుగా వెళ్లొద్దని సూచించారు. ఈ 30 ఏనుగుల గుంపును మళ్లీ కర్ణాటక అటవీ రేంజ్‌లోకి తరిమికొట్టాలని తమిళనాడు అటవీ అధికారులు యోచిస్తున్నారు. నవంబరు 19న తమిళనాడులోని నాగమలై పరిధిలో ఉన్న అన్నామలై రిజర్వ్ ఫారెస్ట్‌లో అటవీ అధికారులు పెట్రోలింగ్ చేస్తుండగా.. 35 ఏళ్ల ఏనుగు దంతాలు లేని స్థితిలో చనిపోయి కనిపించింది. వెటర్నరీ డాక్టర్‌‌తో ఏనుగుకు పోస్టుమార్టం నిర్వహించగా.. అది కొండపై నుంచి జారి పడిపోయిందని వెల్లడైంది.

We’re now on WhatsApp. Click to Join.

ప్రస్తుతం ఏనుగులు సంచరిస్తున్న తమిళనాడులోని సానమావు గ్రామ ప్రజల కథనం ప్రకారం..  ‘‘ప్రతి సంవత్సరం అక్టోబరు, నవంబరు నెలల్లో కర్ణాటకలోని పన్నోగాట అడవుల నుంచి మా రాష్ట్రంలోని  హోసూరు అడవుల్లోకి  ఏనుగుల గుంపులు వలస రావడం సాధారణమైన విషయమే.  తమిళనాడు, కర్ణాటక బార్డర్‌లోని అడవుల మీదుగా తెన్‌ పెన్నై నది ప్రవహిస్తుంటుంది. ఈ ఏడాది తమిళనాడులోని హోసూరు అడవుల ప్రాంతంలో నీటి లభ్యత పెరిగింది. దీంతో హోసూరు ఏరియాలో క్యాబేజీ, వంకాయ, రాగి, బెండకాయ తదితర పంటల సాగు గతేడాది కంటే ముందుగానే ప్రారంభమైంది.  అందుకే ఏనుగులు ఇక్కడికి మళ్లీ రావడం ప్రారంభించాయి. గతేడాదిలాగే ఈసారి కూడా ఏనుగులు ఇంకొన్ని నెలలు ఇక్కడే ఉంటాయి. ఎందుకంటే వాటికి సరిపడా నీరు, ఆహారం ఇక్కడ లభిస్తుంది’’ అని స్థానికులు(30 Elephants Entry) వివరించారు.