Site icon HashtagU Telugu

Coach Catches Fire: రైలు ప్రమాదంలో 10కి చేరిన మృతుల సంఖ్య.. మృతుల కుటుంబాలకి రూ.10 లక్షల నష్ట పరిహారం

Coach Catches Fire

Compressjpeg.online 1280x720 Image 11zon

Coach Catches Fire: తమిళనాడులోని మధురై రైల్వే స్టేషన్ (Madurai Railway Station) సమీపంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఆగి ఉన్న రైలు కంపార్ట్‌మెంట్‌లో మంటలు (Coach Catches Fire) చెలరేగడంతో 10 మంది ప్రయాణికులు మరణించారు. అదే సమయంలో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ మేరకు అధికారులు సమాచారం అందించారు. మృతుల బంధువులకు దక్షిణ రైల్వే రూ.10 లక్షల నష్ట పరిహారం ప్రకటించింది. మరణించిన ప్రయాణికులందరూ మతపరమైన యాత్రకు వెళ్లిన ఉత్తరప్రదేశ్‌కు చెందినవారని అధికారులు పేర్కొన్నారు.

దక్షిణ రైల్వే ప్రకటన ప్రకారం.. ఆగస్టు 17న లక్నోలో బయలుదేరిన ఒక ప్రైవేట్ పార్టీ కోచ్ ఆగస్టు 25న నాగర్‌కోలి జంక్షన్‌లో పునలూర్-మధురై ఎక్స్‌ప్రెస్‌కు జోడించబడింది. ఈ రోజు (ఆగస్టు 26) ఉదయం మధురై స్టేషన్‌కు చేరుకుంది. పార్టీ కోచ్‌ను రైలు నుండి వేరు చేసి మధురై స్టేబుల్ లైన్‌లో ఉంచారు. అక్కడ ఉదయం 5.15 గంటలకు మంటలు వ్యాపించాయి. మంటలు వ్యాపించడంతో 10 మంది ప్రయాణికులు మరణించగా.. 20 మందికి గాయాలు అయ్యాయి.

సిలిండర్‌ కారణమా..?

దక్షిణ రైల్వే ప్రకారం.. కోచ్ లోపల గ్యాస్ సిలిండర్‌ను అక్రమంగా ఉంచారు. దాని కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంపై సమాచారం ఇస్తూ మధురై జిల్లా కలెక్టర్ సంగీత ఈరోజు (శనివారం) ఉదయం మదురై స్టేషన్‌లో ఆగి ఉన్న కోచ్‌లో మంటలు చెలరేగాయి. కోచ్‌లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన భక్తులు ప్రయాణిస్తున్నారని ఆమె తెలిపారు. జిల్లా కలెక్టర్ ఇంకా మాట్లాడుతూ శనివారం ఉదయం కాఫీ చేయడానికి గ్యాస్ వెలిగించగా అదే సమయంలో సిలిండర్ పేలి మంటలు వ్యాపించాయి. కోచ్ నుంచి 55 మందిని తొలగించారు. ఇప్పటి వరకు 9 మృతదేహాలను వెలికితీశారని చెప్పారు.

Also Read: Pregnant Died: మొబైల్‌కు ఛార్జింగ్ పెడుతూ విద్యుత్ షాక్‌తో గర్భిణి మృతి

దక్షిణ రైల్వే అధికారిక ప్రకటన ప్రకారం.. ప్రైవేట్ పార్టీ కోచ్‌లో ప్రయాణికులు సిలిండర్‌ను అక్రమంగా ఉంచారు. ఇది మంటలకు కారణమైంది. మంటలు చెలరేగిన విషయం తెలిసిన వెంటనే పలువురు ప్రయాణికులు రైలు నుంచి కిందకు దిగారు. మరే ఇతర కోచ్‌కు ఎలాంటి హాని జరగలేదని ఆ ప్రకటనలో పేర్కొంది. పార్టీ కోచ్ ఆదివారం చెన్నైకి తిరిగి రావాల్సి ఉంది. అక్కడ నుండి లక్నోకు తిరిగి రావాల్సి ఉంది. ఇంతలోనే ప్రమాదం జరిగింది. రైల్వే అధికారుల ప్రకారం.. ఎవరైనా IRCTC పోర్టల్‌ని ఉపయోగించి పార్టీ కోచ్‌ని బుక్ చేసుకోవచ్చు. ఇది ప్రయాణానికి మాత్రమే ఉపయోగించబడుతుంది. మండే వస్తువులను తీసుకెళ్లకూడదని వారు చెప్పారు.

ప్రమాదంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, మాజీ రైల్వే మంత్రి మమతా బెనర్జీ ట్విట్టర్ ఇలా వ్రాశారు. “రైల్వేలో మరో భయంకరమైన సంఘటన. ఈ సారి మధురై (తమిళనాడు)లో ఒక రైలులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇందులో కనీసం 9 మంది మృతి చెందగా.. కనీసం 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు నా సానుభూతిని, గాయపడిన వారి కోసం ప్రార్థనలను తెలియజేస్తున్నాను.” అని పేర్కొన్నారు.