Site icon HashtagU Telugu

Shaakuntalam Review: సమంత ‘శాకుంతలం’ రివ్యూ.. సినిమా హిట్టా, ఫట్టా?

Shankunthalam

Shankunthalam

ఒకవైపు భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ (Gunashekar), మరోవైపు వైవిధ్యమైన హీరోయిన్ సమంత (Samantha). వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే సినిమాపై అంచనాలు ఏర్పడటం సహజం. యశోద లాంటి యాక్షన్ మూవీ తర్వాత సమంత మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తుండటం, ఇక భారీ పౌరాణిక చిత్రంగా శాకుంతలం తెరకెక్కడం అందర్నీ ఆకర్షించింది. ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చదవాల్సిందే.

స్టోరీ

దుష్యంతుడు (దేవ్ మోహన్) మహా రాజు. ఒకసారి వేటకు వెళ్లినప్పుడు కణ్వ మహర్షి (సచిన్ ఖేడేకర్) ఆశ్రమాన్ని సందర్శిస్తాడు. అక్కడ ఉన్న శకుంతల (సమంత)ను చూసి ఆమె సౌందర్యాని కి ఆకర్షితుడవుతాడు. శకుంతల కూడా దుష్యంతుడి ప్రేమలో (Love) పడుతుంది. ఇద్దరూ గాంధర్వ వివాహం చేసుకుని ఒక్కటి అవుతారు. ఆ తర్వాత వీరి జీవితాల్లో జరిగిన సంఘటనలు ఏమిటి ?, దుష్యంతుడు అసలు శకుంతలను ఎలా మర్చిపోతాడు ?, చివరకు వీరి ప్రేమ కథ ఎలా సాగింది ? ఎలా ముగిసింది ? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే వెండితెర పై ఈ సినిమాను చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్

ఈ సినిమా చూస్తున్నంత సేపు మహాభారతంలోని ఆది పర్వంలోకి వెళ్లి.. శకుంతలా దుష్యంతుల ప్రేమ గాధను (Love Story), బాధను కళ్ళ ముందు చూస్తున్న బావన కలుగుతుంది. ముఖ్యంగా 3డి విజువల్స్ సినిమా స్థాయిని పెంచాయి. అలాగే ప్రేక్షకులకు ఆ అడవి ప్రాంతంలోకి వెళ్లి ఆ లోకంలో విహరిస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. మొత్తమ్మీద అద్భుతమైన విజువల్స్ తో పాటు భారీ సాంకేతిక విలువలతో తెరకెక్కించబడటమే ఈ సినిమా ప్రధాన బలం. ప్రధాన పాత్రల ఎమోషన్ అండ్ పెయిన్ ఫ్యామిలీ ప్రేక్షకులకు కొంతవరకు కనెక్ట్ అవుతుంది.

ఇక సమంత తన పరిపక్వతమైన నటనతో ఈ చిత్రంలో ఉత్తమమైన నటనను కనబర్చారు. ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని ఎమోషనల్ (Emotional) సన్నివేశాల్లో ఆమె తన మార్క్ నటనతో సినిమాకే హైలెట్ గా నిలిచారు. కీలక పాత్రలో నటించిన మోహన్ బాబు తన మ్యానరిజమ్స్ తో తన శైలి నటనతో బాగా ఆకట్టుకున్నారు. హీరోగా నటించిన దేవ్ మోహన్ తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. ఆయనకు సంబంధించిన కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ లో దేవ్ మోహన్ నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

మైనస్ పాయింట్స్

ఎమోషనల్ గా లవ్ స్టోరీతో సాగే ఈ సినిమా విజువల్ పరంగా కొంతవరకు ఆకట్టుకున్నా.. కథ పరంగా ఎలాంటి కొత్తదనం లేదు. అలాగే ఫస్టాఫ్ ను ఆసక్తికరమైన విజువల్స్ తో అక్కడక్కడ కాస్త ఇంట్రెస్ట్ గా నడిపినా.. స్లోగా (Slow Naration) సాగే సీన్స్ తో కొన్నిచోట్ల స్క్రీన్ ప్లే ను నెమ్మదిగా నడిపారు. సెకెండ్ హాఫ్ లో కూడా కొన్ని సీన్స్ చాలా స్లోగా సాగుతాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో సమంత పాత్ర గర్భవతి అయ్యాక వచ్చే సీన్స్ ను అనవసరంగా ల్యాగ్ చేస్తూ డ్రైవ్ చేయడం వల్ల, ఆ సాగదీత సీన్స్ లో ఇంట్రస్ట్ మిస్ అయింది. పాటలు కూడా అంతగా ఆకట్టుకోలేదు. రొటీన్ ప్లేతో బోరింగ్ ట్రీట్మెంట్ తో ఈ పౌరాణిక చిత్రం సాగడంతో సినిమా అవుట్ పుట్ బాగా దెబ్బ తింది. మెయిన్ గా సినిమాలో ప్రేమ కథలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ బాగా పెట్టి ఉండాల్సింది.

విశ్లేషణ:

ఈ సినిమా ఒక మంచి ప్రేమ కథ.ఇక ట్విస్టులు వంటివి అంతగా ఉండవు. మహాభారతం, రామాయణం వంటి పురాణాలు ఇష్టపడే వాళ్లకు ఈ కథ బాగా నచ్చుతుంది. కానీ ఈ తరం ప్రేక్షకులు మాత్రం సినిమాలలో కొత్తదనాన్ని (Freshness) వెతుకుతున్నారు.ఇక డైరెక్టర్ మాత్రం ఒక్కో విషయాన్ని వివరించి చూపించారు.కానీ ఎందుకో అంతగా వర్క్ అవుట్ కానట్టు అనిపించింది.అలా కథ మొత్తం ఒక ఫ్లోలో వెళ్తున్నట్లు అనిపించింది. అనుకున్నంతగా రాణించలేకపోయింది.

Also Read: Pooja Hegde Reaction: సల్మాన్ ఖాన్ తో డేటింగ్.. పూజాహెగ్డే రియాక్షన్ ఇదే!