Worlds Expensive Insect : కాదేదీ ధరకు అనర్హం. ఔను నిజమే !! ఒక చిన్నపాటి పురుగుకు కూడా లక్షల్లో ధర వస్తోంది. ఆ ధర కూడా ఒక లగ్జరీ కారును కొనేంత రేంజులో ఉంది. ఇంతకీ ఎంత అనుకుంటున్నారా ? వివరాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.
We’re now on WhatsApp. Click to Join
స్టాగ్ బీటిల్.. ఇదొక కీటకం. ఇది లుకానిడే అనే కీటకాల కుటుంబానికి చెందినది. ఈ కీటకాలవి 1200 జాతులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. కొన్ని స్టాగ్ బీటిల్ కీటకాలు చెత్తలో ఉంటాయి. కుళ్లిన పదార్థాలు, కలపను తినేందుకు అవి ఇష్టపడతాయి. అలాంటి వాటికి పెద్దగా రేటు ఉండదు. అయితే ఎండిపోయిన చెట్ల బెరడులో జీవిస్తూ పండ్లరసం, చెట్ల ఆకుల రసం తాగే రకానికి చెందిన స్టాగ్ బీటిల్ కీటకాలకు మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. ప్రమాదకర వ్యాధులకు సంబంధించిన మందుల తయారీలో ఈరకానికి చెందిన స్టాగ్ బీటిల్ కీటకాలను వాడుతుంటారు. ఇంతటి డిమాండ్ ఉండటం అనేది ఈ కీటకాల ఉనికికే ముప్పు తెస్తోంది. మందుల తయారీ కోసం వీటిని పెద్ద ఎత్తున ఫార్మా కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయి. అందువల్ల అంతరించిపోయే కీటకాల జాతుల జాబితాలో స్టాగ్ బీటిల్(Worlds Expensive Insect) కూడా చేరిపోయింది.
Also Read :Bandi Sanjay : 26 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు : బండి సంజయ్
ఇంతకీ వీటి రేటు ఎంత ? అంటే.. ఒక స్టాగ్ బీటిల్(Stag Beetle) కీటకానికి రూ.75 లక్షల దాకా రేటు వస్తుందని అంటున్నారు. అంటే ఈ కీటకం మనకు దొరికితే ఫార్మా కంపెనీకి అమ్మేసి.. ఎంచక్కా లైఫ్‌లో సెటిలై పోవచ్చు. ఈ కీటకాలు సాధారణంగానైతే 3 నుంచి 7 సంవత్సరాలు బతుకుతాయి. చలి అతిగా ఉన్న సీజన్లలో ఇవి సడెన్ చనిపోయే రిస్క్ కూడా ఉంటుంది. ఈ కీటకాలకు చలి అంటే అస్సలు పడదు. స్టాగ్ బీటిల్స్ కీటకాల తలపై 5 అంగుళాల పొడవులో నల్లటి కొమ్ములు ఉంటాయి. మగ స్టాగ్ బీటిల్స్ సంతానోత్పత్తి సమయంలో ఆడ స్టాగ్ బీటిల్స్‌తో జత కట్టేందుకు ఈ కొండీలను పరస్పరం కొడుతూ విచిత్రమైన సౌండ్స్ చేస్తాయి.మగ స్టాగ్ బీటిల్ పురుగులు 35 నుంచి 70 మిల్లీమీటర్ల పొడవు, ఆడ స్టాగ్ బీటిల్ పురుగులు 30 నుంచి 50 మిల్లీ మీటర్ల పొడవు ఉంటాయి.