Finger In Ice Cream : ఈ మధ్య కాలంలో హోటళ్లు, రెస్టారెంట్లు బాగా నిర్లక్ష్యంగా ఆహార పదార్థాలను వండుతున్నాయి. ఈక్రమంలో పరిశుభ్రతను పాటించడం లేదు. ఇక నాణ్యత, రుచి సంగతి సరేసరి. అధిక లాభాల ఆశతో చాలాచోట్ల నాసి రకం నూనె, కూరగాయలు, మాంసంతో వంటకాలను తయారు చేస్తున్నారు. దీంతో వాటిని తిన్న ఆహార ప్రియుల ఆరోగ్యం గుల్ల అవుతోంది. తాజాగా ముంబైలో ఓ ఫుడ్ లవర్ ఆన్‌లైన్‌లో ఐస్‌క్రీం(Finger In Ice Cream) కోసం ఆర్డర్ చేయగా.. ఇంటికి డెలివరీ బాయ్ తీసుకొచ్చిన ఐస్ క్రీంలో మనిషి వేలు వచ్చింది. దీంతో ఫుడ్ లవర్ మూడ్ అంతా పాడైపోయింది. ఆన్ లైన్ ఆర్డర్స్‌పై ఆమెకు నమ్మకం తొలగిపోయింది. వంటకాల తయారీలో కంపెనీలు నాణ్యత ప్రమాణాలు పాటిస్తాయని నమ్మిన సదరు ఫుడ్ లవర్.. ఈ ఘటన తర్వాత అలాంటి మాటలను నమ్మబోనని చెబుతోంది. వివరాలివీ..
We’re now on WhatsApp. Click to Join
ఆమె ఓ యువ డాక్టర్. పేరు ఓర్లెమ్ బ్రెండన్ సెర్రావో. మహారాష్ట్రలోని ముంబై వాస్తవ్యురాలు. ఎండలు ఎక్కువగా ఉండటంతో ఇంటి బయటికి వెళ్లలేక ఈ బుధవారం మధ్యాహ్నం ‘ది యుమ్మో బటర్‌స్కాచ్’ ఫ్లేవర్ కోన్ ఐస్‌క్రీమ్‌ల కోసం ఆన్‌లైన్ డెలివరీ యాప్ ద్వారా ఆర్డర్ పెట్టింది. ఐస్ క్రీం వచ్చాక.. ఓర్లెమ్ బ్రెండన్ సెర్రావో, ఆమె సోదరి కలిసి తినడం మొదలుపెట్టారు. ఈక్రమంలో డాక్టర్ ఓర్లెమ్ బ్రెండన్ సెర్రావో నాలుకకు ఏదో గట్టిగా తగిలింది. దీంతో అనుమానం వచ్చి దాన్ని తరచితరచి చూడగా.. అది 2 అంగుళాల మనిషి వేలు అని తేలింది. దీంతో ఆమె తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.
Also Read :NEET Exam : 1,563 మంది నీట్ అభ్యర్థుల గ్రేస్ మార్కులు రద్దు.. వారికి రీటెస్ట్ : కేంద్రం
డాక్టర్ ఓర్లెమ్ బ్రెండన్ సెర్రావో వెంటనే కోపంగా ముంబైలోని మలాడ్‌లోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లయింట్ చేసింది. అధికారులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పోలీసు సిబ్బంది ఆ వేలును ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. ఆ ఐస్‌క్రీం తయారు చేసిన యమ్మో (Yummo) ఐస్‌క్రీమ్ కంపెనీ ప్రాంగణంలో తనిఖీలు చేశారు.దీనిపై ఐస్‌క్రీమ్ తయారీ కంపెనీ నుంచి ఇంకా ఎలాంటి వివరణ వెలువడలేదు. ఇంతకుముందు కూడా దేశంలో పలుచోట్ల ఫుడ్ లవర్స్‌కు ఇదే తరహా చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ప్రభుత్వ ఆహార తనిఖీ సంస్థలు, నాణ్యతా నియంత్రణ విభాగాలు సరిగ్గా పనిచేయకపోవడంతో ప్రజలు ఇలాంటి పాట్లు పడాల్సి వస్తోందనేది జగమెరిగిన సత్యం.