Site icon HashtagU Telugu

Queen Elizabeth II : క్వీన్ ఎలిజిబెత్ అంత్యక్రియలకు వాళ్లను ఎందుకు పిలవలేదు అంటే..!!

Queen Dead Imresizer

Queen Dead Imresizer

క్వీన్ ఎలిజబెత్ II..96 సంవత్సరాల వయస్సులో సెప్టెంబర్ 8న స్కాట్లాండ్‌లోని బాల్మోరల్ కాజిల్ మరణించారు. లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ అబ్బే చర్చిలో క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలు సెప్టెంబర్ 19న జరగనున్నాయి. సెప్టెంబర్ 13న స్కాట్లాండ్ నుంచి రాణి మృతదేహం లండన్ చేరుకుంది. ప్రస్తుతం, క్వీన్ శవపేటిక నాలుగు రోజుల పాటు వెస్ట్ మినిస్టర్ అబ్బేలో ఉంచారు.

ఈ 6 దేశాలకు ఆహ్వానం పంపలేదు:
క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు భారత రాష్ట్రపతితో సహా అనేక దేశాల రాజకీయ నాయకులు హాజరుకానున్నారు. రష్యా, బెలారస్, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, సిరియా మరియు వెనిజులా అనే ఆరు దేశాలు రాణి అంత్యక్రియలకు ఆహ్వానం అందలేదు. ఎందుకంటే ఈ దేశాలతో బ్రిటన్ కు సత్ససంబంధాలు లేవు. అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ మధ్యే బ్రిటన్ కొత్త చక్రవర్తిగా ఎన్నికైన కింగ్ చార్లెస్ IIIని అభినందించారు. ఉత్తరకొరియా, ఇరాన్, దేశాలకు ఆహ్వానం అందింది. అయితే ఈ దేశాల రాయబారి ప్రతినిధులకు మాత్రమే ఆహ్వానం అందించారు.

ఇది కూడా చదవండి : ప్రధాని మోదీ పుట్టినరోజు స్పెషల్ గిఫ్ట్..8 ఆఫ్రికన్ చిరుతలను దేశానికి అప్పగించనున్న నమీబియా..!!

ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అంత్యక్రియలకు హాజరు కావచ్చని సమాచారం. అయితే ఈ వార్తలను బ్రిటన్ ప్రభుత్వం ఖండించింది. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం, UK ప్రభుత్వం అంత్యక్రియలకు అమెరికా అధ్యక్షుడు అతని భార్యకు మాత్రమే ఆహ్వానం పంపించినట్లు పేర్కొంది. భారత్ నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సెప్టెంబర్ 17-19 వరకు లండన్‌లో పర్యటించి బ్రిటన్ రాణి ఎలిజబెత్ II అంత్యక్రియలకు హాజరుకానున్నారు. భారత ప్రభుత్వం తరపున సంతాపాన్ని తెలియజేయనున్నారు.