Hotels Without Walls: జీరో స్టార్ హోటల్.. చుట్టూ గోడలు ఉండవు కానీ బిల్లు మాత్రం మోగిపోతుంది?

మామూలుగా స్టార్ హోటల్స్ అంటే గది, గదిలోపల ఏసి,అలాగే మంచి పరుపు, ఇలా ఒకటి రెండు ఏంటి సకల సౌకర్యాలు

  • Written By:
  • Publish Date - July 15, 2022 / 08:45 AM IST

మామూలుగా స్టార్ హోటల్స్ అంటే గది, గదిలోపల ఏసి,అలాగే మంచి పరుపు, ఇలా ఒకటి రెండు ఏంటి సకల సౌకర్యాలు ఉంటాయి. ప్రదేశాన్ని బట్టి ఆ స్టార్ హోటల్స్ మరింత గ్రాండ్ గా, అత్యాధునిక సౌకర్యాలతో నిర్మిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఒక హోటల్ కీ మాత్రం.. చుట్టూగోడలు ఉండవు. పక్కన ఒక టేబుల్ దానిమీద ఒక ల్యాంప్ అలాగే చిన్న తినుబండరాలు పెట్టుకునేకి ఒక ప్లేస్. ఇక పైన చూస్తే నక్షత్రాలు చుట్టూ చల్లని వాతావరణం కార్లు భవనాలు ఇలా అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అయితే ఆ హోటల్లో సరిగ్గా సౌకర్యాలు లేకపోయినప్పటికీ బిల్లు మాత్రం తడిసి మోపినవుతుందట.

మరి ఆ హోటల్ ఎక్కడ ఉంది దాని ప్రత్యేకత ఏమిటి? అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..అది ఒక జీరో స్టార్ హోటల్. ఈ మధ్యే స్విట్జర్లాండ్ లో ఈ సరికొత్త హోటల్ అందుబాటులోకి వచ్చింది. మామూలుగా సౌకర్యాలను బట్టి హోటళ్లకు స్టార్ రేటింగ్ ఇస్తారు. టూ, త్రీ, ఫైవ్ స్టార్ ఇలా రకరకాలుగా ఉంటాయి. కానీ స్విజర్లాండ్ లోని జీరో హోటల్ లో మాత్రం అలాంటి సౌకర్యాలేమీ ఉండవు. అలా వినూత్న కాన్సెప్ట్ కీ తగ్గట్టుగా ఆ హోటల్ కీ పేరు కూడా చిత్రంగానే నల్ స్టెర్న్ హోటల్ లేదా జీరో స్టార్ హోటల్ అని పేరు పెట్టారు. దీనికి గోడలు, తలుపులు ఉండవు..ఎలాంటి రక్షణ కలిగించే సదుపాయాలు కూడా ఉండవు.

Zero Star Hotel

అయితే కావాల్సిన ఫుడ్, ఇతర అవసరాలేమైనా ఉంటే హోటల్ సిబ్బంది వచ్చి తెచ్చిస్తారు. స్విట్జర్లాండ్ కు చెందిన ఆర్టిస్టులు ఫ్రాంక్‌ రిక్లిన్‌, పాట్రిక్‌ రిక్లిన్‌ బ్రదర్స్‌ ఈ వినూత్న ఆలోచన చేయగా డానియేల్‌ కార్బొనియెర్‌ అనే ఆయన ఈ హోటల్ ను సిద్ధం చేశారు. ఓ వైపు ఆరు బయట నక్షత్రాలు చూస్తూ గడిపే అనుభూతి, మరోవైపు వాతావరణంలో వస్తున్న మార్పులు, కాలుష్యం, రణగొణ ధ్వనులు భూమికెంత నష్టం చేస్తున్నాయో తెలియజెప్పడమే తమ లక్ష్యమని హోటల్ రూపకర్తలు చెబుతున్నారు.ఏమీ లేని జీరో స్టార్ హోటల్ అయినంత మాత్రాన డబ్బులు తక్కువగా కడతామంటే ఒప్పుకోరు. ఇక్కడ ఒక రాత్రి ఉండాలంటే మన కరెన్సీలో దాదాపు రూ.28 వేలు చెల్లించాల్సి ఉంటుంది.అయితే ప్రస్తుతం ఇక్కడి సైలన్‌ అనే పట్టణంలోని పెట్రోల్‌ బంక్‌ పక్కన ఒకటి, వైన్‌ యార్డ్‌ లో మరొకటి, సమీపంలోని పిక్చర్‌ స్క్వేర్‌ కొండ పక్కన ఇంకోటి జీరో స్టార్ హోటల్ గదులను ఏర్పాటు చేశారు