Prisoners Salary: ‘‘జైలుకు వెళితే.. జీవితం నాశనం అయినట్టే’’ !! ఈ మాట నిజమే. మన దేశంలోని జైళ్ల పరిస్థితికి ఈ మాట బాగానే నప్పుతుంది. ఎందుకంటే ఇక్కడి జైళ్లలో ఖైదీల సంస్కరణ కోసం తీసుకుంటున్న చర్యలు నామమాత్రం. సంస్కరణల అమలును మరింతగా పెంచాల్సిన అవసరం చాలా ఉంది. యూకేలోని జైళ్లు ఖైదీలను జీవితంలో ఉద్ధరించే సంస్కరణల అమలులో ది బెస్ట్‌గా నిలుస్తున్నాయి. అక్కడ ఖైదీలలో పరివర్తన తీసుకురావాలని చాలా రకాల చర్యలు చేపడుతుంటారు. ఆ చర్యల ఫలితంగా యూకేలోని కొన్ని ఓపెన్ జైళ్లలో ఉండే ఖైదీల నెలవారీ శాలరీలు.. ఆ జైలులోని అధికారుల కంటే ఎక్కువ రేంజుకు చేరుకున్నాయట.
Also Read :NTR First Remuneration : ఎన్‌టీఆర్‌కు సినిమాల్లో ఛాన్స్ ఎలా వచ్చింది ? తొలి రెమ్యునరేషన్ ఎంత ?
సాధారణ తరహా నేరాలకు పాల్పడిన వారిని యూకేలోని కోర్టులు జైలుశిక్షను అనుభవించడం కోసం ఓపెన్ జైళ్లకు పంపుతుంటాయి. తీవ్రమైన నేరాలు చేసిన వారిని ఉంచడానికి యూకేలో ప్రత్యేకమైన జైళ్లు ఉంటాయి. అక్కడ వసతులు ఉండవు. ఖైదీలను ఎక్కడా బయటికి వదలరు. కానీ ఓపెన్ జైళ్లలో నిబంధనలు అందుకు విరుద్ధంగా ఉంటాయి. సాధారణ తరహా నేరాలకు పాల్పడిన వారే కావడంతో.. ఖైదీలను ఉద్యోగాలు, ఉపాధి కోసం బయటికి వెళ్లేందుకు అనుమతిస్తారు. ఈ నిబంధనలను వాడుకొని చాలామంది ఓపెన్ జైళ్ల ఖైదీలు(Prisoners Salary) జాబ్స్ చేస్తున్నారు.
Also Read :Saira Banu : ప్రపంచంలోని గొప్ప వ్యక్తుల్లో రెహమాన్ ఒకరు.. ఆయనపై విమర్శలొద్దు : సైరా బాను
కొందరు ఖైదీలు లారీ, ట్రక్కుల డ్రైవర్లుగా.. ఇంకొందరు ఖైదీలు ట్యాక్సీ డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. పలువురు ఖైదీలు రెస్టారెంట్లలో పనిచేస్తుండగా.. మరికొందరు ఖైదీలు పెట్రోలు బంకుల్లో పనిచేస్తున్నారు. పలువురు ఖైదీలు ఓవర్ టైమ్ వర్క్ చేసి ప్రతినెలా బాగా సంపాదిస్తున్నారు. ఈవిధంగా కొందరు ఖైదీల వార్షిక వేతనం.. వారు శిక్ష అనుభవించే జైళ్లలో పనిచేసే ప్రభుత్వ సిబ్బంది కంటే ఎక్కువగా ఉంటోందట. పలువురు ఖైదీలు సంవత్సరానికి దాదాపు రూ.38 లక్షలు సంపాదిస్తున్నారట. యూకేలోని జైళ్లలో పనిచేసే గార్డ్‌లకు సంవత్సరానికి వచ్చే శాలరీ కేవలం రూ.29 లక్షలే. ఖైదీలు ఇలా సంపాదించిన డబ్బును జైలు నుంచి విడుదలయ్యాక సొంత వ్యాపారాలు చేసుకునేందుకు సిద్ధంగా ఉంచుకుంటున్నారట.