Site icon HashtagU Telugu

Woman Starves Herself : బొద్దుగున్నావని భర్త చెప్పినందుకు.. బక్కచిక్కి 22 కేజీలకు తగ్గింది

Woman Starves Herself

Woman Starves Herself

Woman Starves Herself : “నువ్వు బొద్దుగా ఉన్నావ్” అని భర్త చెప్పినందుకు ఆమె బక్క చిక్కింది.. 

అన్నం తినడం ఆపేసి..  ఆకలితో అలమటించి.. 22 కిలోల బరువున్న ఫిగర్ లా మారిపోయింది.. 

కట్ చేస్తే.. ఏమైందో తెలుసా ?

బొద్దుగా ఉండటం.. స్లిమ్ గా ఉండటం .. రెండూ వేర్వేరు లుక్స్.. దేనికదే స్పెషల్ !! ఆమె  బొద్దుగా ఉండటంతో భర్త ఎక్కడికీ తీసుకెళ్ళేవాడు.. నువ్వు బొద్దుగా ఉండటం ఏం బాలేదు అనేవాడు.. భర్త మాటలు విన్న ఆమె ఎలాగైనా వెయిట్ లాస్ కావాలని డిసైడ్ అయింది. అన్నం తినడం(Woman Starves Herself) తగ్గించేసింది.  కుకీలు, టీ, నీరు, మిఠాయి, చీజ్ ముక్క, సగం గ్లాసు ఉడకబెట్టిన పులుసు మాత్రమే రోజూ తీసుకునేది. వెయిట్ లాస్ ఎక్సర్ సైజ్ లు కూడా చేసేది. ఎట్టకేలకు ఆమె బరువు తగ్గిపోయి  22 కిలోలకు చేరింది. అయినా ఆమెను భర్త దూరంగా పెట్టాడు.. ఈ బాధాకర అనుభవం రష్యాలోని బెల్గోరోడ్‌కు చెందిన యానా బోబ్రోవా అనే మహిళకు ఎదురైంది.

Also read : Shocking: బిహార్ లో దారుణం, ప్రియుడి మ‌ర్మాంగాన్ని కోసిన ప్రియురాలు

ఆమె భర్త అంతటితో ఊరుకోలేదు. స్లిమ్ గా మారిన తర్వాత యానా బోబ్రోవా చేసే జాబ్ ను మాన్పించాడు. బయట ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు ఆమెను తోడుగా తీసుకెళ్లేవాడు కాదు.  చివరకు ఆమెతో జీవించడం ఇష్టం లేదని వదిలేశాడు కూడా !! ఈవివరాలన్నీ స్వయంగా యానా బోబ్రోవా చెప్పింది.  “బియాండ్ ది బోర్డర్‌” అనే ఒక రష్యన్  టీవీ షోలో తన జీవిత అనుభవాలను వెల్లడించింది. షోలో మాట్లాడుతుండగానే ఆమె ఆరోగ్యం దెబ్బతింది. దీంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. యానా బోబ్రోవా బరువు ఒకానొక దశలో 17 కిలోగ్రాములకు పడిపోయిందని అంటున్నారు.  అయితే, ఇది ఆమె షోలో కనిపించడానికి ముందా ? తర్వాతా ? అనే దానిపై క్లారిటీ లేదు. మొత్తం మీద ఇంతగా బరువు తగ్గడం ఆమె ఆరోగ్యాన్ని దెబ్బతీసింది అనేది క్లియర్. అకస్మాత్తుగా వచ్చేది.. పోయేది .. ఏదైనా డేంజరే అని మనం ఇప్పటికైనా అర్ధం చేసుకోవాలి.