Site icon HashtagU Telugu

New Delhi : సామాన్యులకు శుభవార్త. నేటి నుంచి అమల్లోకి తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.!!

Free At Petrol Pump

Free At Petrol Pump

వాహనదారులకు గుడ్ న్యూస్ . దేశంలో చాలా రోజుల తర్వాత పెట్రోల్, డీజీల్ ధరలు తగ్గాయి. పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు 40 పైసలు తగ్గాయి. కొత్త ధరలు మంగళవారం ఉదయం 6 గంటల నుంచి అమలులోకి వచ్చాయి. సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.96.72, కోల్‌కతాలో రూ.106.03, ముంబైలో రూ.106.31, చెన్నైలో రూ.102.63గా ఉంది.

ఇది కూడా చదవండి: మోర్బీ ఘటన నేపథ్యంలో..కాంగ్రెస్ చేపట్టిన గుజరాత్ పరివర్తన్ సంకల్ప్ యాత్ర వాయిదా..!!

అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టడంతోపాటు చమురు సంస్థలు ఇంధనం ధరలను తగ్గిస్తున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ బ్యారెల్ ధర 95డాలర్ల కంటే తక్కువగా ఉంది. కాగా ఆరు నెలల తర్వాత పెట్రోల్, డిజిల్ పై ధరలు తగ్గించడం ఇదే తొలిసారి. ఈ సంవత్సరంలో చివరిసారిగా ఏప్రిల్ 7న పెట్రోల్, డిజిల్ ధరలను తగ్గించారు. ప్రస్తుతం లీటర్ పై 40 పైసలు తగ్గించినప్పటికీ…రానున్న రోజుల్లో లీటర్ కు రెండు రూపాయల వరకు తగ్గే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.