Viral Photo : బైక్ పై వెళ్తూ ల్యాప్ టాప్ లో వ‌ర్క్.. వైర‌ల్ గా మారిన ఫొటో!!

ఎంత ఎమర్జెన్సీ ఉన్నా.. బైక్ వెనుక సీటులో కూర్చొని ఎవరూ ల్యాప్ టాప్ లో పనిచేయరు. అలా పనిచేసే పరిస్థితే వస్తే.. దారుణమైన పని వాతావరణం ఉందని అర్ధం చేసుకోవచ్చు.

  • Written By:
  • Publish Date - July 13, 2022 / 02:00 PM IST

ఎంత ఎమర్జెన్సీ ఉన్నా.. బైక్ వెనుక సీటులో కూర్చొని ఎవరూ ల్యాప్ టాప్ లో పనిచేయరు. అలా పనిచేసే పరిస్థితే వస్తే.. దారుణమైన పని వాతావరణం ఉందని అర్ధం చేసుకోవచ్చు. బాసిజం బలంగా ఉందని కూడా అవగతం చేసుకోవచ్చు. ఇటువంటిదే ఒక ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది.

ఒక పిలియన్ రైడర్..

బెంగళూరు రోడ్డుపై హ‌ర్షీమీత్ సింగ్ అనే వ్య‌క్తి ఒక అరుదైన దృశ్యాన్ని చూశాడు. ఒక బైక్ లో వెనుక సీటుపై కూర్చున్న వ్యక్తి ల్యాప్ టాప్ లో వర్క్ చేస్తూ బిజీ బిజీగా కనిపించాడు. దాన్ని కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫోటోకు కోకొల్లలుగా కామెంట్స్ వెల్లువెత్తాయి. ప్రధానంగా తన లింక్డ్ ఇన్ అకౌంట్లో ఈ ఫోటోను పోస్ట్ చేస్తూ హ‌ర్షీమీత్ సింగ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. “ఈ ఫొటోకు బెంగళూరు అత్యుత్తమంగా ఉందా .. లేదా.. చెత్తగా ఉందా ? 11 pm అనేది బెంగళూరు  నగరంలో అత్యంత రద్దీగా ఉండే ఫ్లైఓవర్‌లలో ఒకటి. ఇక్కడ ఒక పిలియన్ రైడర్ తన ల్యాప్‌టాప్‌లో పని చేస్తున్నాడు. ఒక బాస్‌గా మీరు టార్గెట్ రీచ్ కావ‌డానికి మీ సహోద్యోగుల భ‌ద్ర‌త‌ను ఫ‌ణంగా పెట్టి, వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్న‌ట్ల‌యితే .. మళ్లీ ఒకసారి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ముఖ్యంగా మీరు ఆదేశించే స్థాయిలో ఉన్న‌ట్ల‌యితే ‘IT’S URGENT’, ‘DO IT ASAP’ అనే పదాలను మరింత జాగ్రత్తగా ఉప‌యోగించుకోవాలి. ఈ మాటలు కింది స్థాయి ఉద్యోగుల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో మీకు తెలియదు”  అని హ‌ర్షీమీత్ సింగ్ వ్యాఖ్యానించారు. ఏ అర్జెంట్ వ‌ర్క్ ఉందో .. ఏమో తెలీదు గానీ పాపం బైక్ పై ప్రయాణిస్తూ కూడా ప‌ని చేశాడు. మొత్తం మీద ఓ వ్య‌క్తి బైక్ పై ప్ర‌యాణిస్తూ లాప్ ట్యాప్ లో వ‌ర్క్ చేయ‌డం వైర‌ల్ అవుతోంది.

Link :  https://www.linkedin.com/embed/feed/update/urn:li:share:6948494811226062848