24 Fingers Family: సాధారణంగానైతే చాలామంది కాళ్లు, చేతులకు మొత్తం 20 వేళ్లే ఉంటాయి. అయితే ఆ కుటుంబంలోని 50 మందికిపైగా సభ్యులకు 24 వేళ్లు ఉన్నాయి. దీంతో వాళ్లు ఎన్నో సమస్యలను, బాధలను ఎదుర్కొంటున్నారు. వాటిని తలచుకొని కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఈ దుస్థితిని బిహార్‌లోని గయ జిల్లా తెయుసా గ్రామం చౌదరి తోలా ఏరియాలో నివసించే సుఖరి చౌదరి కుటుంబం ఎదుర్కొంటోంది. ఆ వివరాలపై ఒక లుక్ వేద్దాం..
Also Read :Kavitha CM Race: సీఎం రేసులోకి కవిత.. కేటీఆర్‌తో పోటీ ఖాయమేనా ?
7 నెలల పిల్లల నుంచి 60 ఏళ్ల వయస్కుల దాకా..
24 వేళ్ల సమస్య తొలుత సుఖరి చౌదరితోనే మొదలైంది. ఆయన 24 వేళ్లతో(24 Fingers Family) జన్మించారు. కొన్నేళ్ల క్రితమే ఆయన చనిపోయారు. సుఖరి చౌదరి కుటుంబంలో 24 వేళ్లు ఉన్న వారిలో 7 నెలల పిల్లల నుంచి 60 ఏళ్ల పెద్ద వయస్కుల దాకా ఉన్నారు. గత నాలుగు తరాలుగా ఈ కుటుంబంలోని ఎంతోమంది 24 వేళ్లతోనే పుట్టారు. అయితే 22 వేళ్లు ఉన్నవారు ముగ్గురే ఉన్నారు. ప్రస్తుతం సుఖరి చౌదరి ఫ్యామిలీలోని 50 మందికిపైగా సభ్యులు ఈ సమస్యతో సతమతం అవుతున్నారు. మనోవేదనను అనుభవిస్తున్నారు. ఆర్మీ జాబ్స్ లాంటి ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారు. ఆడపిల్లలకు పెళ్లి సంబంధాలు కుదరడం లేదు. ఒకవేళ ఆడపిల్లలకు పెళ్లయినా.. మెట్టినింటిలో సూటిపోటి మాటలు పడాల్సి వస్తోంది.
Also Read :Indias Best Friends: ‘ఆపరేషన్ సిందూర్’ వేళ భారత్‌కు బెస్ట్ ఫ్రెండ్స్.. ‘‘ఆ నలుగురు’’ !
ఏమిటీ వ్యాధి ?
చేతులు, కాళ్లకు అదనపు వేళ్లు ఉండే ఈ వ్యాధిని పాలిడాక్టిలీ అని పిలుస్తారు. చాలామందిలో ఈ అదనపు వేళ్లు చిన్న సైజులో ఉంటాయి. కొందరిలో ఈ అదనపు వేళ్లు పెద్ద సైజులో ఉంటాయి. పాలిడాక్టిలీ సమస్య కలిగిన అందరిలోనూ అదనపు వేళ్లు బాగానే పనిచేస్తాయి. అయితే అతికొద్ది మందిలో అదనపు వేళ్లు సరిగ్గా చేయవు. ఆ ఆరోగ్య సమస్యను హైపర్ డాక్టిలీ అంటారు. జన్యుపరమైన కారణాలతోనే పాలిడాక్టిలీ, హైపర్ డాక్టిలీ సమస్యలు వస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్స ద్వారా అదనపు వేళ్లను తొలగించవచ్చని డాక్టర్లు అంటున్నారు. అదనపు వేళ్లు ఉండటం అనేది వైకల్యం పరిధిలోకి రాదు. అందువల్ల సుఖరి చౌదరి కుటుంబీకులు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనాన్ని పొందలేకపోతున్నారు.