Super Commuter Mom: ఆమె ‘సూపర్ కమ్యూటర్ మదర్’. కమ్యూటర్ అంటే ప్రయాణించే వారు. సూపర్ కమ్యూటర్ అంటే చాలాపెద్ద దూరాలు ప్రయాణించేవారు. ఇవాళ మనం భారత సంతతికి చెందిన ‘సూపర్ కమ్యూటర్ మదర్’ గురించి తెలుసుకోబోతున్నాం. ఆమె ప్రతిరోజూ రాక, పోక కలుపుకొని దాదాపు 700 కిలోమీటర్లు జర్నీ చేస్తుంటుంది. అది కూడా విమానంలో. వివరాలు చూద్దాం..
Also Read :EVMs Memory : ఈవీఎంలలోని డేటాపై ఈసీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
పిల్లల కోసం కీలక నిర్ణయం
ఆమె పేరు రేచల్ కౌర్. ఎయిర్ ఏషియాలో ఫైనాన్స్ విభాగంలో అసిస్టెంట్ మేనేజర్‌గా సేవలు అందిస్తున్నారు. రేచల్‌కు ఇద్దరు పిల్లలు. పిల్లల వయసులు 11 ఏళ్లు, 12 ఏళ్లు. మలేషియాలోని పెనాంగ్ ప్రాంతంలో రేచల్ నివసిస్తున్నారు. ప్రస్తుతం ఆమె డ్యూటీ కౌలాలంపూర్‌లో నడుస్తోంది. గతంలో ఆఫీసుకు సమీపంలోనే రేచల్(Super Commuter Mom) ఒక ఇంటిని అద్దెకు తీసుకొని ఉండేవారు. తన పిల్లల్ని చూడ్డానికి వారానికి ఒక్కరోజు మాత్రమే అవకాశం దక్కేది. పిల్లలకు దూరంగా ఉండటం రేచల్‌కు చాలా టఫ్‌గా అనిపించింది. దీంతో ఆమె కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయమే ఆమెను సూపర్ కమ్యూటర్ మదర్‌గా మార్చింది.
Also Read :Monkey Catch : సర్పంచ్ ఎన్నికలు.. కోతులపై కీలక అప్‌డేట్
ఉదయం 4 గంటలకు నిద్రలేచి..
రేచల్ ఇల్లు పెనాంగ్‌లో ఉంది. కౌలాలంపూర్‌లో ఆఫీసు ఉంది.కౌలాలంపూర్‌లో ఆఫీసుకు దగ్గరగా అద్దెకు ఉండాలంటే ప్రతినెలా రూ.42 వేలు ఖర్చయ్యేవి. ఈ ఖర్చును తగ్గించుకోవడంతో పాటు రోజూ తన ఇద్దరు పిల్లలను చూసుకునేందుకు రేచల్ భలే ప్లాన్ వేసింది. ప్రతిరోజూ విమానంలో పెనాంగ్ నుంచి కౌలాలంపూర్‌కు రాకపోకలు సాగించాలని నిర్ణయించుకుంది. కౌలాలంపూర్‌లో తన రూంకు అయ్యే అద్దె కంటే విమానంలో అక్కడికి అప్ అండ్ డౌన్ చేయడానికి అయ్యే ప్రయాణ ఖర్చులే తక్కువగా ఉన్నాయని రేచల్ గుర్తించింది. అందుకే ఇప్పుడు వారంలో ఐదు రోజులూ విమానంలో పెనాంగ్ నుంచి కౌలాలంపూర్‌లోని ఆఫీసుకు వెళ్తోంది. పెనాంగ్ నుంచి కౌలాలంపూర్‌కు దాదాపు 350 కి.మీ దూరం ఉంటుంది. అంటే ప్రతిరోజూ సగటున 700 కి.మీ దూరాన్ని రేచల్ ప్రయాణిస్తోంది. ఇందుకోసం ఆమె ప్రతిరోజూ ఉదయాన్నే 4 గంటలకు నిద్ర లేస్తుంది. 5 గంటలకల్లా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటుంది. 5.55 గంటలకు విమానం ఎక్కి, 7.45 గంటలకల్లా ఆఫీసుకు చేరుకుంటుంది. డ్యూటీ ముగియగానే రాత్రి 8 గంటలకల్లా విమానంలో ఇంటికి చేరుకుంటుంది. ప్రయాణ సమయంలో రేచల్ తనకు ఇష్టమైన మ్యూజిక్‌ను వింటుంది.