Bikini – Island : ఆయిల్ రిచ్ అరబ్ దేశాల కుబేరుల స్టైలే వేరు. వాళ్లు ఏది చేసినా వెరీవెరీ స్పెషల్. భారీగా సంపద ఉండటం వల్ల ప్రపంచంలో ఎవరూ చేయలేని పనులను వాళ్లు చేసి చూపిస్తుంటారు. తాజాగా దుబాయ్ సంపన్నుల్లో ఒకరైన 33 ఏళ్ల జమాల్ అల్ నదాక్ అందరినీ అబ్బురపరిచే ఒక డీల్ చేశారు. ఆ డీల్ ఎందుకు చేశారో తెలిస్తే మీరు ముక్కున వేలు వేసుకోక మానరు!!
Also Read :Longest Serving Prisoner : 46 ఏళ్ల సుదీర్ఘ జైలు జీవితం.. ఆ వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించిన కోర్టు
జమాల్ అల్ నదాక్ భార్య పేరు సౌదీ అల్ నదాక్. ఆమె వయసు 26 ఏళ్లు. జమాల్ అల్ నదాక్ తన భార్య కోసం ఒక ప్రైవేటు ఐలాండ్‌ను తాజాగా కొన్నారు. దాని విలువ రూ.418 కోట్లు. ఇంతకీ ఎందుకు తెలుసా ? మరేం లేదు.. తన భార్య బికినీ ధరించి, నిర్భయంగా తిరిగేందుకు!! ప్రైవేటు దీవి ఉంటే అక్కడి బీచ్‌లో బికినీ వేసుకొని తిరిగేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని భార్య సౌదీ అల్ నదాక్ చెప్పడంతో జమాల్ అల్ నదాక్ ఏకంగా ఒక ఐలాండ్‌నే కొనేశారట. ఈక్రమంలో రేటు గురించి అస్సలు ఆలోచించలేదట. రూ.418 కోట్లు అనగానే డబ్బులు తీసి ఇచ్చేశారట. దీనిపై ఇప్పుడు ఇంటర్నెట్‌లో వాడివేడి చర్చ జరుగుతోంది. ‘‘భర్త జమాల్ అల్ నదాక్ నా కోసం ఒక దీవిని(Bikini – Island) కొన్నారు. నేను అక్కడ నిర్భయంగా బికినీ వేసుకొని తిరగొచ్చు’’ అని పేర్కొంటూ సౌదీ అల్ నదాక్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేశారు. అందులో తాము కొనేసిన ప్రైవేటు ఐలాండ్ వీడియో క్లిప్‌ను జతపరిచారు.
Also Read :Byjus – BCCI : 15వేల కోట్ల అప్పులుంటే.. బీసీసీఐ అప్పు మాత్రమే ఎందుకు చెల్లించారు.. బైజూస్‌కు ‘సుప్రీం’ ప్రశ్న
లాంగ్ టర్మ్‌లో ఆ ప్రైవేటు దీవి తమకు మంచి పెట్టుబడి సాధనంగా కూడా పనికొస్తుందని జమాల్ అల్ నదాక్ అంటున్నారు. విలాసాల కోసమే దాన్ని తాము కొన్నామని అనుకోవడం సరికాదని చెబుతున్నారు. ఆ ద్వీపం ఆసియా ఖండంలోనిదే అని చెప్పిన జమాల్ అల్ నదాక్.. కచ్చితంగా ఎక్కడ ఉందనేది మాత్రం వెల్లడించలేదు.