Viral Video: వార్ని.. పార్టీలో ఎంజాయ్ చెయ్యమంటే నిప్పు పెట్టావ్‌గా.. వైరల్ వీడియో!

సాధారణంగా వివాహాలకు లేదన్న ఏదైనా ఫంక్షన్లకు పటాకులు బాణా సంచాలు పేలుస్తూ ఉంటారు.

  • Written By:
  • Publish Date - July 7, 2022 / 08:00 AM IST

సాధారణంగా వివాహాలకు లేదన్న ఏదైనా ఫంక్షన్లకు పటాకులు బాణా సంచాలు పేలుస్తూ ఉంటారు. అయితే కొందరు ఈ బాణా సంచాలు టపాసులు పిలుస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు. కానీ మరికొందరు మాత్రం తాగిన మైకంలో ఆ టపాసులను దగ్గరుండి కాల్చడం లేదంటే కాలుతున్న ఆ టపాసుల దగ్గరికి వెళ్లి చేతులతో పట్టుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే వారు చేసే పనుల వల్ల పక్కన వారు కూడా భయభ్రాంతులకు లోనవుతూ ఉంటారు. తాజాగా అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అయితే ఆ వీడియోని చూసి కొందరు నవ్వుకుంటుండగా మరి కొందరు మాత్రం ఆ వ్యక్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వీడియోలో ఏముందంటే.. ఒక వేడుకలో భాగంగా ఒక వ్యక్తి బాగా మద్యం సేవించి ఉన్నాడు. ఈ క్రమంలోనే అక్కడ అందరూ డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండగా అతను కూడా ఎంజాయ్ చేస్తూ మధ్యలో వెళ్లి క్రాకర్స్ ని చేతులతో పట్టుకుని అటు ఇటు తిప్పుతూ సరదాగా డాన్స్ చేస్తూ ఉంటాడు. అలా డాన్స్ చేస్తూ ఒక మహిళ దగ్గరికి వెళ్లి డాన్స్ చేస్తూ ఉండగా తన చేతిలోని క్రాకర్స్ పక్కనే ఉన్న ఒక వస్తువుకు తగలడంతో అది వెంటనే అంటుకుంటుంది.

ఇక వెంటనే అప్రమత్తం అయిన మహిళ ఆ వస్తువు పక్కనే డోర్ కర్టన్ ను తీసివేస్తుంది. అక్కడ ఉన్న వస్తువుకి మంటలు అంటుకోవడంతో చుట్టూ ఉన్నవారు ఫైర్, ఫైర్ అంటూ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఈ క్రమంలోని ఆ వస్తువుకి నిప్పు అంటించిన వ్యక్తి తాగిన మైకంలోనే ఆ నిప్పుని కాళ్లతో తొక్కి ఆర్పేస్తాడు. ఆ నిప్పును ఆర్పేసిన ఆ వ్యక్తి మళ్లీ ఏమీ కాలేదు అన్నట్టుగా అందరి వైపు చూస్తూ నవ్వుతూ వెళ్లి మళ్లీ డాన్స్ చేస్తూ ఉంటాడు. అలా అతను మంటను ఆర్పడంతో అక్కడున్న వారంతా పెద్ద ప్రమాదం నుంచి ఒకసారిగా బయటపడినట్టుగా ఊపిరి పీల్చుకుంటారు. ఎందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోని దాదాపుగా 13 మిలియన్లకు పైగా మంది చూశారు.