Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్…CRPFలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు..!!

సీఆర్పీఎఫ్ రిక్రూట్ మెంట్ లేదా స్పోర్ట్స్ కోటా రిక్రూట్ మెంట్ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త.

  • Written By:
  • Publish Date - October 21, 2022 / 11:54 AM IST

సీఆర్పీఎఫ్ రిక్రూట్ మెంట్ లేదా స్పోర్ట్స్ కోటా రిక్రూట్ మెంట్ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ పలు విభాగాల నుంచి గ్రూస్ సిలో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 24 క్రీడలకు సంబంధించిగానూ 322 ఖాళీలను ప్రకటించింది. వీటిలో మొత్తం 257 మంది పురుష అభ్యర్థులకు 65 మహిళలకు ఖాళీలు ఉన్నాయి. క్రీడల వారీగా ఖాళీల గురించి చూసినట్లయితే…అథ్లెటిక్స్ కోసం 50ఖాళీలు ఉన్నాయి. పురుషులకు 27 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థలు మిగతా అన్ని క్రీడలకు సంబంధించిన సమాచారన్ని నోటిఫికేషన్ లో చెక్ చేసుకోవచ్చు.

అధికారిక వెబ్ సైట్ crpf.gov.inనుంచి రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తును ఫాంను ఆఫ్ లైన్ లోనూ పొందవచ్చు. నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుంచి 45 రోజులలో దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ ను చెక్ చేయండి.

స్పోర్ట్స్ కోటాలో రిక్రూట్ మెంట్ కింద హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు 12 పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ నాటికి 18ఏళ్ల నుంచి 23 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. అదనంగా అభ్యర్థులు ఖాళీలకు సంబంధించిన క్రీడలలో వ్యక్తిగత లేదా జట్టు స్థాయిలో జాతీయ పోటీలో పతకం సాధించి ఉండాలి.