Site icon HashtagU Telugu

No Entry Places : మనదేశంలో మనుషులకు ఎంట్రీ లేని ప్రదేశాలివే..

No Entry Places Min

No Entry Places Min

No Entry Places : మనుషులకు ప్రవేశం లేని ప్రదేశాలు కొన్ని దేశాల్లో ఉన్నాయని మనం వింటుంటాం. అయితే మన దేశంలో కూడా అలాంటి డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయని చాలామందికి తెలియదు. అలాంటి విచిత్రమైన ప్రదేశాల(No Entry Places) గురించి ఇప్పుడు మనం క్లుప్తంగా తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

బారెన్ ద్వీపం

అండమాన్ దీవుల్లో బారెన్ ద్వీపం ఉంది. దీన్ని చూడటానికి టూరిస్టులను అనుమతించరు. ఇక్కడొక అగ్నిపర్వతం ఉంది. అది నిత్యం విస్పోటనం చెందుతుంటుంది. అందుకే పర్యాటకుల భద్రత రీత్యా ఆ ద్వీపానికి వెళ్లనివ్వరు.

సెంటినెల్ దీవులు

అండమాన్‌ నికోబార్ దీవుల్లోని సెంటినెల్ దీవులు సహా  కొన్ని ప్రాంతాలను బయోస్పియర్ రిజర్వ్‌లుగా గుర్తించారు. సెంటినెల్ దీవుల్లో అరుదైన తెగల ప్రజలు నివసిస్తుంటారు. వారిని సంరక్షించడానికిగానూ అక్కడికి టూరిస్టులను అనుమతించరు.

డౌ హిల్స్

పశ్చిమ బెంగాల్‌లోని డౌ హిల్స్ ప్రాంతం చూడటానికి భయం గొలిపేలా ఉంటుంది. ఆ ప్రాంతానికి వెళితే ఎవరో వెంటపడుతున్నట్లుగా అనిపిస్తుంది. అందుకే ఈ ప్రదేశానికి వెళ్లడానికి  టూరిస్టులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు.

భాంఘర్ కోట

దయ్యాలు తిరిగే ప్రదేశమని.. రాజస్థాన్‌లోని భాంఘర్ కోటను పిలుస్తారు. సాయంత్రం టైం తర్వాత ఈ కోట సందర్శనకు ఎవరినీ అనుమతించరు. ఈ కోటలో రాత్రి టైంలో దయ్యాలు తిరుగుతుంటాయని కథలుకథలుగా చెబుతుంటారు. అందుకే  సాయంత్రం తర్వాత ఈ కోటలోకి ఎవరినీ అనుమతించరు.

Also Read: Chandrababu Helicopter : దారి తప్పిన చంద్రబాబు హెలికాప్టర్.. తర్వాత ఏమైందంటే ?

ప్యాంగాంగ్ సరస్సులోని ఆ భాగం

చైనా -భారత్ సైన్యాల మధ్య నాలుగేళ్ల క్రితం గొడవలు జరిగాయి గుర్తుంది కదూ. ప్యాంగాంగ్ సరస్సుకు సమీపంలోని ఏరియాలోనూ ఇరుదేశాల సైన్యాలు ఘర్షణకు దిగాయి. ఈ సరస్సు ఎగువ ప్రాంతంలోకి టూరిస్టులను వెళ్లనివ్వరు. టూరిస్టుల భద్రతను దృష్టిలో ఉంచుకొని అక్కడికి పర్యాటకులను అనుమతించరు.

స్టోక్ కాంగ్రీ

కశ్మీర్‌లోని లడఖ్ పరిధిలో స్టోక్ కాంగ్రీ ప్రాంతం ఉంది. ఇక్కడ  ట్రెక్కింగ్ చేయడం అద్భుతమైన ఫీలింగ్ ఇస్తుంది. గతంలో ఇక్కడికి టూరిస్టులను అనుమతించేవారు. ఇప్పుడు టూరిస్టులను స్టోక్ కాంగ్రీ ప్రాంతంలోకి పంపడం లేదు. ఈ ప్రాంతంలోని హిమానీనదాలు కరిగిపోతుండటం, భూభాగం చాలా క్లిష్టంగా ఉండటం వల్ల అక్కడికి వెళ్లేందుకు టూరిస్టులకు పర్మిషన్స్ మంజూరు చేయడం లేదు.

చార్లెవిల్లే మాన్షన్ 

హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా పెద్ద టూరిస్ట్ స్పాట్. ఇక్కడి చార్లెవిల్లే మాన్షన్ మాత్రం చూడటానికి దెయ్యాల కోటలా ఉంటుంది. ఈ భవనం పాడుపడి ఉంది. ఇందులో దయ్యాలు తిరుగుతున్నాయని స్థానికులు నమ్ముతుంటారు. అందుకే సాయంత్రం తర్వాత ఈ భవనం వైపు ఎవరూ వెళ్లరు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ భవంతిని చూడటానికి ఎవరిని అనుమతించడం లేదు.