Site icon HashtagU Telugu

Hair In Stomach : ఆమె కడుపులో రెండున్నర కేజీల వెంట్రుకలు.. డాక్టర్లు షాక్!

Hair From Stomach

Hair From Stomach

Hair In Stomach : కడుపులో నుంచి పెద్ద కణుతులు బయటపడ్డ వాళ్లను మనం చూశాం. అయితే ఆశ్చర్యకరంగా ఓ మహిళ కడుపులో నుంచి రెండున్నర కిలోల వెంట్రుకలు బయటపడ్డాయి. వాటిని చూసి డాక్టర్లు కూడా షాక్‌కు గురయ్యారు. ఉత్తరప్రదేశ్​లోని మహోబా జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలివీ..

We’re now on WhatsApp. Click to Join

మహోబా జిల్లాకు చెందిన ఓ  25ఏళ్ల మహిళకు ఈ చేదు అనుభవం ఎదురైంది. ఆమెకు ప్రసవం జరిగినప్పటి నుంచి తరచూ కడుపు నొప్పి వచ్చేది.  దీంతో ఆమెను చాలా హాస్పిటళ్లలో చూపించారు. అయినా కడుపునొప్పి తగ్గలేదు. చివరకు మధ్యప్రదే‌శ్‌లోని​ సత్​నా జిల్లాలో ఉన్న జానకీకుండ్​ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్ సదరు మహిళలకు వైద్య పరీక్షలు చేయించారు. వివిధ స్కానింగ్స్ తీయించారు. ఓ స్కానింగ్ రిపోర్టును చూడగా.. ఆ మహిళ కడుపులో ఏదో కణితి లాంటిది ఉందని కనిపించింది. అది బయటికి తీయాలంటే సర్జరీ చేయక తప్పదని డాక్టర్ చెప్పారు. దీనికి  సదరు కుటుంబం ఓకే చెప్పడంతో ఆ మహిళకు సర్జరీ చేశారు. కడుపులో నుంచి గడ్డలాంటి ఓ నిర్మాణాన్ని తీసి బయట ఓ పాత్రలో వేశారు. తీరా దాన్ని చూస్తే.. అది వెంట్రుకల కుప్ప అని డాక్టర్లు గ్రహించారు. దాదాపు రెండున్నర కిలోల వెంట్రుకలు(Hair in Stomach) ఓ కుప్పగా మారి, కడుపులో పేరుకుపోయాయని వైద్యులు చెప్పారు. వాటి వల్లే సదరు మహిళకు తరుచూ కడుపు నొప్పి వస్తుండేదన్నారు.

Also Read :Rajinikanth : హిమాలయాలకు బయలుదేరిన రజనీకాంత్‌.. ఆధ్యాత్మికతపై కీలక వ్యాఖ్యలు

ఆపరేషన్ చేయించుకున్న ఆ మహిళ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని డాక్టర్లు వెల్లడించారు.  దీనిపై ఆ మహిళను డాక్టర్లు ఆరా తీయగా.. తాను గర్భంతో ఉన్నప్పుడు వెంట్రుకలు తినేదాన్ని అని బదులిచ్చింది. రెండోసారి గర్భం దాల్చిన తర్వాత తనకు వెంట్రుకలు తినడం అలవాటైందని చెప్పింది. ఇలాంటి మానసిక పరిస్థితిని ‘ట్రైకోఫాగియా’ అని పిలుస్తారని డాక్టర్లు తెలిపారు. సాధారణంగా కొంతమంది పిల్లలు ఇలా వెంట్రుకలు తినేస్తుంటారని చెప్పారు.

Also Read : PM Candidate : 48 గంటల్లో ప్రధాని అభ్యర్థిపై ప్రకటన.. గతంలో టీడీపీ మా మిత్రపక్షమే : జైరాం రమేశ్