Site icon HashtagU Telugu

Surprise Reason Vs Mobile Towers : ఆ ఊరు సెల్ టవర్స్ కు నో చెప్పింది.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు

Surprise Reason Vs Mobile Towers

Surprise Reason Vs Mobile Towers

Surprise Reason Vs Mobile Towers : సెల్ ఫోన్ టవర్స్.. 

ఇవి ఎక్కడపడితే అక్కడ .. నివాస సముదాయాల మధ్య ఏర్పాటు అవుతుండటాన్ని మనం చూస్తున్నాం..

సెల్ ఫోన్ టవర్స్ నుంచి ప్రమాదకర రేడియేషన్ వెలువడుతుందని.. పరిసర ప్రాంతాల ప్రజల హెల్త్  పై అది ఎఫెక్ట్ చూపిస్తుందని చాలా రీసెర్చ్ రిపోర్ట్స్ వచ్చాయి.. 

ఇలాంటి కారణాలతో సెల్ ఫోన్ టవర్స్ ఏర్పాటును స్థానికులు అడ్డుకున్న ఘటనలను మనం చూశాం.. 

కానీ తాజాగా జరిగిన ఒక ఘటన డిఫరెంట్.. దాని కారణం వెరీ డిఫరెంట్ !!

Also read : Ap Politics: వేడెక్కుతున్న రాజకీయాలు.. నెక్స్ట్ సీఎం జూనియర్!

చత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ జిల్లా లచ్కెరా(Lachkera) గ్రామస్తులు తమ ఊరిలో సెల్ ఫోన్ టవర్ ఏర్పాటును అడ్డుకున్నారు. తమకు ఇంటర్నెట్ కనెక్టివిటీ అక్కర లేదని వాళ్ళు తేల్చి చెప్పారు. ఊరిలో సెల్ ఫోన్ టవర్ ఏర్పాటుకు ఏ కంపెనీ వచ్చినా  అడ్డుకుంటామని స్పష్టం చేశారు. వాళ్ళ ఈ నిర్ణయం వెనుక స్వార్ధం లేదు.. తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలనే తాపత్రయం లేదు..  లచ్కెరా గ్రామస్తులు ఆలోచిస్తున్నది ఒకే ఒక విషయం గురించి!! అదే.. ఆ ఊరికి వలస వచ్చే పక్షులు !!

Also read : Chief Selector Agarkar: వెస్టిండీస్ కు సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్..!

చైనా, థాయ్ లాండ్, బర్మా, ఇండోనేషియా నుంచి అతిథులు 

ప్రతి సంవత్సరం వర్షాకాలంలో చైనా, థాయ్ లాండ్, బర్మా, ఇండోనేషియా నుంచి ఈ ఊరికి వందలాది ఏషియన్ ఓపెన్‌బిల్ జాతి కొంగలు వలస వస్తుంటాయి. లచ్కెరా గ్రామంలోని చెట్లపై  ఈ కొంగలు గూళ్ళు కట్టుకొని గుడ్లు పెట్టి సంతానోత్పత్తి చేస్తుంటాయి. ఈక్రమంలో ఊరిలోని చెరువులో  ఉన్న నీటి పాములు, కప్పలు, కీటకాలను తింటాయి. అవి ఇక్కడ సంతానోత్పత్తి చేసుకొని.. తమ పిల్లలతో కలిసి దీపావళి పండుగ టైం తర్వాత వెళ్లిపోతాయి.

Also read : Drone Satellite : 5జీ ఇంటర్నెట్ ఇచ్చే డ్రోన్.. 115 అడుగుల రెక్కలతో రయ్ రయ్

వాళ్ళ భయమంతా కొంగల గురించే..

ఒకవేళ ఊరిలో సెల్ ఫోన్ టవర్స్ ఏర్పాటైతే ఈ పక్షుల  సంతానోత్పత్తి ప్రక్రియకు ముప్పు వాటిల్లుతుందని  లచ్కెరా గ్రామస్తులు భయపడుతున్నారు. ఈ కారణాల వల్లే(Surprise Reason Vs Mobile Towers)  తమ ఊరిలో సెల్ ఫోన్ టవర్స్ ఏర్పాటు చేయొద్దని తేల్చి చెబుతున్నారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈవిషయాన్ని లచ్కెరా గ్రామ సర్పంచ్ ఉదయ్ నిషాద్ వెల్లడించారు. “మా ఊరికి ఇంటర్నెట్ కనెక్షన్ వీక్ గా ఉన్న పరవాలేదు..  కానీ  మా ఊరిని నమ్ముకొని వలస వచ్చే పక్షుల ప్రాణాలకు రిస్క్ కలగడానికి వీల్లేదు” అని ఆయన తేల్చి చెప్పారు. మొబైల్ టవర్ల ఏర్పాటుకు నో చెబుతూ తాము తీర్మానం కూడా చేశామని చెప్పారు. ఊరిలో ఎవరైనా వలస పక్షులకు హాని కలిగిస్తున్నట్లుగా గుర్తిస్తే , వారికి రూ.1,000 జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు.