Bride And Groom Fight: స్టేజీ మీదే కొట్టుకున్న కొత్త జంట.. చక్కర్లు కొడుతున్న వీడియో

‘‘వద్దురా సోదరా.. పెళ్లంటే నూరేళ్లమంట రా’’ అని నిరూపిస్తున్నారు ఈ తరం కొత్త జంటలు (New Couple).

Published By: HashtagU Telugu Desk
Bride And Groom Fight, wedding

Viral

పెళ్లి (Wedding) అనగానే పందిళ్లు.. తాళాలు, తలంబ్రాలు లాంటివి గుర్తుకువస్తాయి. కానీ ఈతరం పెళ్లిళ్లు (Wedding) మాత్రం ఇందుకు విరుద్ధంగా జరుగుతూ చర్చనీయాంశమవుతున్నాయి. పెళ్లంటే ‘‘చెంపదెబ్బలు.. తన్నులాటలు’’ అని నిరూపిస్తున్నాయి ఈ తరం జంటలు. అందుకు ఉదాహరణే ఈ ఘటన. మొదట పెళ్లికొడుకు పెళ్లికూతురికి మిఠాయిలు తినిపించడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఆమెకు ఇష్టం లేకపోయినా తినిపిస్తాడు. దీంతో పెళ్లికూతురు కోపంగా అతని చెంపపై ఓ దెబ్బ వేస్తుంది.

దీంతో వరుడు మరింత కోపం తెచ్చుకుని ఆమెను కొట్టడం మొదలుపెడతాడు. ఆ తర్వాత దంపతులు (bride and groom) ఒకరినొకరు తోసుకుంటూ ఆవేశంగా ఒకరిపై ఒకరు పడి తన్నుకుంటారు. ఫ్యామిలీ మెంబర్స్ సర్ది చెప్పినా ఆగకుండా కొట్టుకున్నారు. ఈ వీడియోను ట్విటర్‌లో ‘ఘర్కేకలేష్’ అనే వ్యక్తి షేర్ చేశాడు. 76 వేలకు పైగా వ్యూస్ తో సోషల్ మీడియాలో చక్కర్లు (Viral) కొడుతోంది.  “యే షాదీ హోరీ యా విడాకులు?” అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

Also Read: Katrina Kaif Looks: కవ్విస్తున్నా కత్రినా.. స్టన్నింగ్ లుక్స్ లో కేక!

  Last Updated: 15 Dec 2022, 03:39 PM IST