Site icon HashtagU Telugu

Blue Whales Singing : సంతానోత్పత్తి టైంలో పాట పాడే తిమింగలాలు

Blue Whales Singing

Blue Whales Singing

Blue Whales Singing :  నీలి తిమింగలాలు (బ్లూ వేల్స్) .. తిమింగలాల్లో ఇవి చాలా స్పెషల్!! భూమ్మీద ఏకైక అతిపెద్ద జంతువుగా వీటికి గుర్తింపు ఉంది. తూర్పు ఆఫ్రికాలోని సీషెల్స్ అనే దేశంలోని సముద్ర జలాల్లో నీలి తిమింగలాలు ఇంకా పెద్దసంఖ్యలో ఉన్నాయి. అక్కడ సముద్రపు నీటి అడుగున ఏర్పాటుచేసిన ‘సౌండ్ ట్రాప్’ కారణంగా నీలి తిమింగలాలు ఉన్నాయని లేటెస్ట్ రీసెర్చ్‌లో వెల్లడైంది. శాస్త్రవేత్తలు ఈ సౌండ్ ట్రాప్‌‌ను నీటిపైకి తీసుకొచ్చాక క్షుణ్ణంగా విశ్లేషించారు. సీషెల్స్ ప్రాంతంలోని బ్లూవేల్స్.. వాటి పరిసరాల్లో మనుషుల కదలికలు లేని టైంలో తమవైన పాటలు పాడుకున్నాయని, అవి చేసిన సౌండ్స్ ఆధారంగా అర్థం చేసుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

 ‘‘సంతానోత్పత్తి సమయంలో మాత్రమే బ్లూ వేల్స్ పాటలు పాడతాయి. బహుశా మగవే పాట పాడతాయని భావిస్తున్నాం. ఇలా ఎందుకు చెపుతున్నామంటే ఇతర జీవులు ఇలాంటప్పుడు ఏం చేస్తాయో మాకు తెలుసు కాబట్టే ఈ నిర్థరణకు వస్తున్నాం. సీషెల్ సముద్రజలాలు వాటి సంతానోత్పత్తికి అనువైన ప్రాంతమయ్యే అవకాశం ఉంది’’ అని శాస్త్రవేత్తలు  వివరించారు. బ్లూవేల్ పాట మనిషి వినికిడి పరిధిని మించి ఉంటుందన్నారు. ఈమేరకు వివరాలతో ‘ఎన్‌డేంజర్డ్ స్పీసిస్’ అనే రీసర్చ్ జర్నల్‌‌లో ఒక నివేదిక పబ్లిష్ అయింది.

Also Read: Parliament Session : 4 నుంచి పార్లమెంటు సెషన్.. ప్రవేశపెట్టనున్న 19 బిల్లులివే

బ్లూవేల్స్ పాటలను మనుషులు కూడా వినవచ్చని కొందరు శాస్త్రవేత్తలు తెలిపారు. గతంలో మెక్సికోలో తాను వేల్స్ శబ్దాలను రికార్డు చేసినప్పుడు, వాటిని హెడ్‌ఫోన్స్‌లో వినగలిగానని ఒక సైంటిస్టు చెప్పారు. బ్లూ వేల్స్ పాడే పాటలు 15 నుంచి 20 సెకన్లపాటు గాలిలో జెట్ ఇంజిన్ చేసే శబ్దంతో సమానమైన ధ్వనిని చేస్తాయన్నారు. నీలి తిమింగలాలు ఒకదానికొకటి వందల కిలోమీటర్లు.. వేల  కిలోమీటర్ల దూరంలో ఉన్నా శబ్దాలతో సమాచారం ఇచ్చి పుచ్చుకోగలవని(Blue Whales Singing) చెప్పారు.