Site icon HashtagU Telugu

Husband Kiss: ముద్దు పెట్టుకున్నందుకు విడాకులు ఇచ్చేసిన భార్య

Wedding

Wedding

అంగరంగవైభవంగా పెళ్లి జరిగింది. ఇంకేముంది ఆనందంలోనో, భార్య మీద ప్రేమతోనే అందరి ముందు ముద్దు పెట్టాడు ఓ భర్త. ఇది చాలా చిన్న విషయమే అయినప్పటికీ, భార్య మాత్రం ఏకంగా ఆ భర్తకు విడాకులు ఇచ్చేసింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని సంభాల్ లో జరిగింది.  నవంబర్ 26న వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. 28వ తేదీన పావసా గ్రామంలో భారీగా రిసెప్షన్ ఏర్పాటుచేశారు. దాదాపు 300 మంది అతిథులు హాజరయ్యారు. స్టేజ్ పై నూతన వధూవరులు కూర్చున్నారు.

అయితే సడెన్ గా తన భార్యను ముద్దుపెట్టుకున్నాడు భర్త. ఊహించని ఈ పరిణామానికి భార్య షాక్ అయింది. ఆ వెంటనే కోపం తెచ్చుకుంది. వెంటనే స్టేజ్ దిగి చకచకా తన గదిలోకి నడుచుకుంటూ వెళ్లిపోయింది. బంధువులు నచ్చజెప్పినా వినలేదు. వందలాది మంది మధ్య తన పర్మిషన్ లేకుండా ముద్దాడిన భర్త క్యారెక్టర్ ను ఆమె అనుమానించింది. తన భర్త ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందని, విడాకులకు అప్లయ్ చేసింది. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతోంది.

Exit mobile version