Divorce Celebration: కూతురి విడాకులకు ఊరేగింపు వేడుక..

పెళ్లికి ఊరేగింపుగా వెళ్లడం చూశాం. కానీ విడాకులు తీసుకుని పుట్టింటికి వస్తే, బ్యాండ్ బాజాలతో ఊరేగింపు తీయడం ఎక్కడైనా చూశారా..? ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో సరిగ్గా ఇదే జరిగింది. ఒక తండ్రి తన కూతురి విడాకులను విషాదంగా కాకుండా, ఆమెకు లభించిన స్వేచ్ఛగా భావించి వేడుకగా జరిపిన తీరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. మీరట్‌కు చెందిన ప్రేమ్ లతా అనే మహిళ తన భర్త నుంచి అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ఆమె పుట్టింటికి తిరిగి వచ్చిన […]

Published By: HashtagU Telugu Desk
UP man turns daughter's divorce into a celebration

UP man turns daughter's divorce into a celebration

పెళ్లికి ఊరేగింపుగా వెళ్లడం చూశాం. కానీ విడాకులు తీసుకుని పుట్టింటికి వస్తే, బ్యాండ్ బాజాలతో ఊరేగింపు తీయడం ఎక్కడైనా చూశారా..? ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో సరిగ్గా ఇదే జరిగింది. ఒక తండ్రి తన కూతురి విడాకులను విషాదంగా కాకుండా, ఆమెకు లభించిన స్వేచ్ఛగా భావించి వేడుకగా జరిపిన తీరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

వివరాల్లోకి వెళితే.. మీరట్‌కు చెందిన ప్రేమ్ లతా అనే మహిళ తన భర్త నుంచి అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ఆమె పుట్టింటికి తిరిగి వచ్చిన సందర్భంగా, తండ్రి గజానంద్ గుప్త వినూత్న రీతిలో సంబరాలు జరిపారు. బ్యాండ్ మేళాలు, డ్యాన్సులతో కూతురికి ఘనంగా స్వాగతం పలికారు. బాణసంచా కాలుస్తూ, చుట్టుపక్కల వారికి మిఠాయిలు పంచిపెట్టి తన ఆనందాన్ని పంచుకున్నారు.

ఈ వేడుకపై గజానంద్ గుప్త మాట్లాడుతూ.. ‘నా కూతురు పెళ్లి తర్వాత చాలా కష్టాలు పడింది. ఇప్పుడు ఆ నరకప్రాయమైన బంధం నుంచి బయటపడటం మాకు పండగ లాంటింది. అందుకే తనను గౌరవంగా ఇంటికి ఆహ్వానించాం’ అని వివరించారు. విడాకులు అంటే జీవితం ముగిసిపోయినట్టు కాదని, అదొక కొత్త ఆరంభమని ఆయన తన చర్యతో చాటిచెప్పారు.

సాధారణంగా విడాకుల విషయంలో సమాజానికి భయపడి చాలా కుటుంబాలు వెనకడుగు వేస్తాయి. కానీ, గజానంద్ గుప్త తన కూతురి సంతోషమే ముఖ్యమని భావించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, నెటిజన్లు ఆయన్ను ‘సూపర్ డాడ్’ అంటూ కొనియాడుతున్నారు. కష్టాల్లో ఉన్న ఆడపిల్లలకు కుటుంబం అండగా నిలవడమే నిజమైన బాధ్యత అని ఈ తండ్రి నిరూపించారు.

  Last Updated: 06 Apr 2026, 11:21 AM IST