Site icon HashtagU Telugu

PhD At 89 Years : 89 ఏళ్ల ఏజ్‌లో పీహెచ్‌డీ.. పెద్దాయన కొత్త రికార్డు

Phd At 89 Years

Phd At 89 Years

PhD At 89 Years : 18 ఏళ్లకే చదువుపై నుంచి ఇంట్రెస్ట్ కోల్పోతున్న యూత్‌ను కూడా  ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇలాంటి టైంలో  ఓ పెద్దాయన 89 ఏళ్ల ఏజ్‌లో పీహెచ్‌డీ (డాక్టరేట్​ ఇన్​ ఫిలాసఫీ) చేశారు. దీంతో మనదేశంలో తొమ్మిది పదుల వయసులో పీహెచ్‌డీ చేసిన తొలి సీనియర్​ గ్రాడ్యుయేట్​గా రికార్డును క్రియేట్ చేశారు. ఈ రికార్డును క్రియేట్ చేసిన పెద్దాయన పేరు మార్కండేయ దొడ్డమణి. కర్ణాటక వాస్తవ్యుడు. కర్ణాటక విశ్వవిద్యాలయం నుంచి ఇటీవల పీహెచ్‌డీ పట్టా పొందానని ఆయన వెల్లడించారు. కర్ణాటకలోని ధార్వాడ్‌లోని జయనగర్‌లో నివాసముంటున్న మార్కండేయ దొడ్డమణి ఉపాధ్యాయుడిగా పదవీ విరమణ పొందిన తర్వాత సాహిత్య రంగంలో చాలాకాలం పాటు పనిచేశారు.

We’re now on WhatsApp. Click to Join

18 ఏళ్ల పాటు శివశరణ్​ డోహర కక్కయ్య అనే సాహితీవేత్త రచించిన వచనాలు, ఆయన జీవిత చరిత్రపై రీసెర్చ్ చేశారు. ఈక్రమంలోనే మార్కండేయకు సాహితీవేత్త కక్కయ్యకు సంబంధించిన వచన సాహిత్యంపై పీహెచ్​డీ చేయాలనే ఆలోచన మార్కండేయకు  వచ్చింది. దీంతో ఆయన కర్ణాటక విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ కోర్సులో చేరారు. తనలోని నేర్చుకునే తత్వం, కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తే  సక్సెస్‌ఫుల్‌గా పీహెచ్‌డీ కోర్సు కంప్లీట్ చేసే దిశగా నడిపాయని మార్కండేయ తెలిపారు.  సాహితీవేత్త కక్కయ్యకు సంబంధించిన ఎన్నో కొత్త విషయాలను తెలుసుకుని మొత్తం 150 పేజీల థీసిస్​ను మార్కండేయ పూర్తి చేశారు. ఇంతకుముందు కర్ణాటకలో  79 ఏళ్ల వయసులో ఓ వ్యక్తి పీహెచ్​డీ పట్టాను(PhD At 89 Years) అందుకున్నారు. ఆ రికార్డును ఇప్పుడు మార్కండేయ దొడ్డమణి బద్దలు కొట్టి సత్తా చాటారు. సాహిత్యంపై ఈయనకున్న అపారమైన అభిమానం, పట్టుదలను ప్రతిఒక్కరూ అభినందిస్తున్నారు.

Also Read : 232 Crore – A Car : అదానీ, అంబానీ కూడా కొనలేని లగ్జరీ కారు.. విశేషాలివీ

ఆంధ్రప్రదేశ్ లో పీహెచ్డీ ప్రవేశాల కోసం నిర్వహించే ఆంధ్రప్రదేశ్ రిసెర్చ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (APRCET) 2024 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ముఖ్య వివరాలను పేర్కొంది. ఈనెల 20వ తేదీ నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. మార్చి 19వ తేదీ వరకు అప్లికేషన్లను స్వీకరించనున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా రాష్ట్రంలో ఉన్న పలు యూనివర్శిటీల్లో పీహెచ్డీ ప్రవేశాలను కల్పించనున్నారు. ఇందులో ఫుల్ టైమ్/పార్ట్ టైమ్ ప్రవేశాలు కూడా ఉంటాయి. http://cets.apsche.ap.gov.in వెబ్ సైట్ లో పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

ముఖ్య వివరాలివీ..

  • ప్రవేశ పరీక్ష పేరు – ఆంధ్రప్రదేశ్ రిసెర్చ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్, APRCET 2024.
  • ప్రవేశాలు – పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
  • విభాగాలు- ఆర్ట్స్, సైన్స్, హ్యుమానిటీస్, సోషల్ సైన్స్, ఫైన్ ఆర్ట్స్, ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్, కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్, ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్ ప్లానింగ్, లా తో పాటు మరికొన్ని కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
  • అర్హతలు – డిగ్రీ, పీజీ ఉండాలి. సెట్, నెట్ అర్హత ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉండాలి.
  • దరఖాస్తులు – ఆన్ లైన్ ద్వారా స్వీకరిస్తారు.
  • దరఖాస్తులు ప్రారంభం – ఫిబ్రవరి 20, 2024.
  • దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ – మార్తి 19, 2024.
  • ఎంపిక విధానం – ప్రవేశ పరీక్ష, ఇంటర్వూ ద్వారా తుది జాబితా ప్రకటిస్తారు.
  • పరీక్ష కేంద్రాలు – శ్రీకాకుళం, విజయవాడ, కడప, విజయనగరం, గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం, ఒంగోలు, అనంతపురం, కాకినాడ, నెల్లూరు, భీమవరం, తిరుపతి, హైదరాబాద్ నగరాలను ఎగ్జామ్ సెంటర్లుగా పెట్టుకోవచ్చు.
  • పరీక్షల తేదీలు – ఏప్రిల్ తొలి వారంలో ఉండే అవకాశం ఉంది.
  • అధికారిక వెబ్ సైట్ – https://apsche.ap.gov.in/i
  • సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ – 9030407022