Animal Movie Twitter Review: రణ్‌బీర్ కపూర్, రష్మిమందన హీరో హీరోయిన్లుగా తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి తెరకెక్కించిన మూవీ యానిమల్ (Animal Movie Twitter Review). ఈ మూవీ నేడు (01-12-2023) ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అయ్యింది. ఇక ఈసినిమాలో అనిల్ కపూర్, బాబీ డియోల్, తృప్తి దిమ్రి, బబ్లూ పృథ్వీరాజ్, శక్తి కపూర్, ప్రేమ్ చోప్రా, సురేష్ ఒబెరాయ్ ముఖ్య పాత్రలు పోషించారు. తండ్రీకొడుకుల అనుబంధంలో ఒక కొత్త కోణాన్ని ఈ సినిమా ద్వారా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రేక్షకులకు చూపించబోతున్నారు. మరి ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఏమంటున్నారు.. ట్విట్టర్ రివ్యూ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..?
తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో యాక్షన్ కథాంశంతో సందీప్ రూపొందించిన ఈ సినిమాలో అనిల్‌కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు. యానిమల్ మూవీలో తండ్రీ కొడుకుల బంధాన్ని కొత్త కోణంలో సందీప్ రెడ్డి చూపించాడని నెటిజన్లు చెబుతోన్నారు. రెగ్యులర్ సినిమాలకు పూర్తి భిన్నంగా కొత్త ఫీల్‌ను యానిమల్ అందిస్తుందని అంటున్నారు.
Also Read: Single Ticket – 56 Days : ఒకే ఒక్క టికెట్‌తో 56 రోజుల ట్రైన్ జర్నీ
Wide Angle shots Yem pettav anna #Animal
— Vivek 💙🤍💚 (@viveklingireddy) December 1, 2023
Denakka 1st half ke idem high ra babuuu…
Vangaaaaa 🥵🥵🥵 jarraithe sachipotunde ra#Animal #AnimalPremieres
— SaiKiran (@saikirantweetz) December 1, 2023
తండ్రి మీద విపరీతమైన ప్రేమ కలిగిన ఒక కొడుకు, తండ్రి కోసం ఎంత క్రూరంగా మారాడు, శత్రువులను ఎలా హతమార్చాడు అనే పాయింట్ ను బేస్ చేసుకుని సినిమాను సందీప్ తెరపై ఆవిష్కరించినట్టు సమాచారం. ఈ సినిమాలో మంచి ఎమోషనల్ డ్రామాతో పాటు విపరీతమైన వయలెన్స్, రణ్‌బీర్-రష్మిక మధ్య రొమాన్స్ కూడా బాగా వర్క్ అయిందని తెలుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join.
యానిమల్ మూవీకి ఎక్కడా చూసిన పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. రన్ టైమ్ గురించి కొందరు నెటిజన్లు సినిమా ఎప్పుడు స్టార్ట్ అయ్యింది..?ఎప్పుడు అయిపోయింది కూడా తెలియలేదు అంటూ ట్వీట్ చేశారు. రణ్ బీర్ యాక్టింగ్ కు ఫిదా అయ్యాం. యానిమల్ మూవీ అద్భుతంగా ఉంది అంటూ ట్వీట్ చేస్తున్నారు. ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగాపై ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎలా తీశావు సందీప్ రెడ్డి ఈ సినిమాను. అద్బుతంగా వచ్చింది. 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుంది ఈ సినిమా అంటూ ట్వీట్ లో ఓ అభిమాని వెల్లడించాడు.
https://twitter.com/Boxofficepage/status/1730397674464297055
ఈ రివ్యూస్ లోనే ఒక నెగిటివ్ పాయింట్ ఎక్కువగా కనిపిస్తుంది. అదే మూవీలో ఉన్న టూమచ్ వయెలెన్స్. ఇది పిల్లలతో, కుటుంబాలతో కలిసి ఎంజాయ్ చేయదగిన సినిమా కాదు అని అంటున్నారు. రొమాన్స్ కూడా ఎక్కువగా ఉండటంతో పిల్లలు, పెద్దవాళ్ళతో కలిసి చూడటం కష్టమే అంటున్నారు ట్విట్టర్ జనాలు.