Site icon HashtagU Telugu

International Women’s Day 2024 : ఈ వయసులు దాటిన మహిళలు ఆ టెస్టులు చేయించుకోవాల్సిందే..

women's medical tests

women's medical tests

International Women’s Day : మహిళలు లేనిదే సృష్టి లేదు. సృష్టి లేనిదే ప్రపంచం లేదు. ఏడాదంతా ఇంట్లో ఆడవారిని గౌరవించకపోయినా.. మార్చి 8న ప్రపంచమంతా ఏకమై జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మీ ఇంట్లో అమ్మ, అక్క, చెల్లి, భార్య.. ఇలా ఎంతమంది ఆడవారుంటే అంతమందినీ గౌరవించండి. వారికి ఏం నచ్చుతుందో దానిని బహుమతిగా ఇచ్చి సర్ ప్రైజ్ చేయండి. అలాగే కొంత వయసు దాటిన తర్వాత మహిళలకు తప్పనిసరిగా చేయించాల్సిన కొన్ని మెడికల్ టెస్టులున్నాయి. అశ్రద్ధ చేస్తే.. మున్ముందు కొన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ టెస్టులు ఏంటి.. ఏ వయసు వారు ఏయే టెస్టులు చేయించుకోవాలో చూద్దాం.

30 సంవత్సరాలు దాటిన తర్వాత చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు

పాప్ స్మియర్ టెస్ట్ : గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందో లేదో తెలుసుకునేందుకు చేసే పరీక్ష. మీరు గర్భాశయ క్యాన్సర్ తో బాధపడుతున్నట్లయితే.. అది చికిత్సతో నయమయ్యే అవకాశం ఉంది. ఈ టెస్టులో యోని, అండాశయాలు, ఫెలోపియన్ ట్యూబ్స్, గర్భాశయం, వల్వా, గర్భాశయంతో సహా పునరుత్పత్తి అవయవాల శారీరక పరీక్ష ఉంటుంది.

మామోగ్రామ్ పరీక్ష. ఇది రొమ్ము క్యాన్సర్ ను గుర్తించడంలో సహాయపడుతుంది. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ సర్వసాధారణమైంది.

థైరాయిడ్ టెస్ట్.. మహిళలలో థైరాయిడ్ గ్రంథి ఎక్కువ లేదా తక్కువగా ఉంటుంది. ఈ రోజుల్లో ఈ సమస్య చాలా మందికి వస్తుంది. థైరాయిడ్ గ్రంథి పనితీరు సరిగ్గా ఉందో లేదో చూపించుకోవడం చాలా అవసరం.

మీ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిల్ని తెలియజేసేది లిపిడ్ ప్యానెల్ పరీక్ష. శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే.. అది మీ ధమనులను మూసుకుపోయేలా చేస్తుంది. ఫలితంగా గుండెజబ్బులకు దారితీస్తుంది.

40 ఏళ్లు దాటిన మహిళలు కొలెస్ట్రాల్ స్క్రీనింగ్ పరీక్ష, డయాబెటిస్ స్క్రీనింగ్ పరీక్ష, కంటి పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. నలభై ఏళ్లు దాటిన తర్వాత ప్రతి ఆరునెలలకోసారి కంటి పరీక్షలు చేయించుకోవాలి.

50 సంవత్సరాలు దాటిన మహిళలు డ్యూయల్ ఎనర్జీ ఎక్స్ రే అబ్సార్ట్పియోమెట్రీ పరీక్ష చేయించుకోవాలి. ఇది బోలు ఎముకల వ్యాధి గురించి తెలియజేస్తుంది. మీ ఎముకల సాంద్రతను చూపిస్తుంది.

కొలనోస్కోపీ. పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తెలియజేస్తుంది. లోపలి భాగాన్ని పరిశీలించి.. దాని గురించి తెలియజేస్తారు వైద్యులు.

Also Read : Health Tips: అధిక బరువుతో ఇబ్బంది పడుతుంటే రోజు ఈ 4ఆకులు తినాల్సిందే?