అందమైన, ఒత్తైన నల్లని జుట్టు (Hair) ఉండాలని ప్రతి మహిళ (Women ) కోరుకుంటుంది. కానీ అనేకమంది తమకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తూ జుట్టుకు హాని చేస్తుంటారు. ముఖ్యంగా తలస్నానం చేసిన వెంటనే తడి జుట్టును దువ్వుకోవడం వల్ల కేశాలు బలహీనమై ఊడిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తడి జుట్టులో కుదుళ్లు సున్నితంగా ఉండడం వల్ల చిన్న ఒత్తిడికే జుట్టు తెగిపోతుందట. అందుకే జుట్టు పూర్తిగా ఆరిన తర్వాతే దువ్వుకోవడం, స్టైల్ చేసుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు.
Akshara Andhra : 100 శాతం అక్షరాస్యత కోసం ‘అక్షర ఆంధ్ర’ – నారా లోకేష్
ఇంకా తలస్నానం చేసిన తర్వాత జుట్టు త్వరగా ఆరిపోవాలనే ఉద్దేశంతో టవల్‌తో రుద్దడం, లేదా తలకు చుట్టేసి ఉంచడం కూడా చాలా మందికి అలవాటే. కానీ ఇవి కేశాల ఆరోగ్యానికి నష్టాన్ని కలిగిస్తాయని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. తడిగా ఉన్న జుట్టు టవల్‌తో బిగుతుగా చుట్టడం వల్ల తేమ రేటెన్షన్ అవ్వడంతో కుదుళ్లు బలహీనమవుతాయి. దీని వల్ల చుండ్రు, చివరలు చిట్లడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అందువల్ల జుట్టును మృదువుగా తుడిచి సహజంగా ఆరనివ్వడం ఉత్తమ మార్గమని సూచిస్తున్నారు.
Visakha Economic Region: 8 జిల్లాలతో ‘విశాఖ ఎకనమిక్ రీజియన్’: సీఎం చంద్రబాబు
అలాగే హెయిర్ డ్రైయర్లు, స్ట్రెయిట్‌నర్లు, కర్లర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను తరచూ వాడటం వల్ల కేశాలు పొడిబారడం, రంగు కోల్పోవడం వంటి సమస్యలు తలెత్తుతాయట. వీటిని అవసరమైతే మాత్రమే వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. అదనంగా, జుట్టును బిగుతుగా లాగి వేస్తున్న హెయిర్ స్టైల్స్ (పోనీటెయిల్స్, బన్స్, కార్న్‌రోస్) వల్ల కుదుళ్ల రక్త ప్రసరణ తారుమారవుతుందని, ఫలితంగా జుట్టు తేలిపోవడం లేదా అలోపేసియా సమస్యలు రావొచ్చని చెబుతున్నారు. కాబట్టి జుట్టుకు ఆరోగ్యంగా ఉండేలా సహజమైన శైలులు ఎంచుకోవడం, నిమిత్తంగా ట్రిమ్మింగ్ చేయడం వంటి అలవాట్లు మెరుగైన ఫలితాలు ఇస్తాయని నిపుణుల సూచన.