Work Outs: ఈ వర్క్ ఔట్స్ తో బరువుతో పాటు గుండెను కూడా రక్షించుకోవచ్చు

బరువు తగ్గడం అతి ముఖ్య విషయం. ఈ విషయంలో వర్కౌట్ కీ రోల్ పోషిస్తుంది. అయితే, ఏ వర్కౌట్స్ చేస్తే మంచిది.

వర్కౌట్ (Work Outs) చాలా ముఖ్యమైన అంశం. బెస్ట్ వర్కౌట్ ద్వారా ఎన్నో బెనిఫిట్స్‌ ఉంటాయి. అయితే, వర్కౌట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. లేకపోతే లేనిపోని సమస్యలు వస్తాయి. ఇది కేలరీలను బర్న్ చేస్తుంది. గాయాలయ్యేలా చూస్తుంది. రన్నింగ్, జంపింగ్ వంటి వంటి వర్కౌట్స్‌ (Work Outs) తో పోలిస్తే.. పాదాలపై ఒత్తిడి కలిగించని స్టెప్పింగ్, నడక వంటివి ట్రై చేయొచ్చు. ఇక ఇంకేం చేయొచ్చో ఇప్పుడు చూద్దాం.

లో ఇంపాక్ట్ కార్డియో వర్కౌట్స్ (Work Outs):

లో ఇంపాక్ట్ కార్డియో వర్కౌట్స్ చాలా మంచిది. ఇవి చేయడం వల్ల హృదయ స్పందన రేటుని పెంచి ఫిట్‌నెస్‌ని కోల్పోకుండా చేస్తాయి. లో కార్డియో వర్కౌట్స్‌ అంటే ఎక్కువ కష్టపడకుండా చేసేవి. వీటిలో కొన్నింటిని చేయడం పెద్దగా కష్టమేమి కాదు. పైగా వీటిని చేస్తే త్వరగా బరువు తగ్గుతారు కూడా. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఎలిప్టికల్ వర్కౌట్ (Work Outs):

ఈ వర్కౌట్ చేయడం కూడా చాలా మంచిది. ఈజీగా చేసే ఈ వర్కౌట్ బరువు తగ్గేందుకు చాలా బాగా పని చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. తక్కువ ఎఫెక్టివ్ ఏరోబిక్ వర్కౌట్స్ చేయడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు. ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. జిమ్‌లో ఎక్కువగా ఉండే ఈ వర్కౌట్.. ఈ మెషిన్ కొనుక్కుని ఇంట్లోనూ చేయొచ్చు. దీని వల్ల త్వరగా బరువు తగ్గుతారు. ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు.

బ్రిస్క్ వాక్:

స్పీడ్ వాక్ కంట మరో ఎఫెక్టివ్ వర్కౌట్ లేదంటే అతిశయోక్తి కాదు. దీని వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. అదే విధంగా, ఎవరైనా ఎప్పుడైనా చేయొచ్చు. మిగతా వర్కౌట్స్‌లా దీనికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. దీనిని చేయడం వల్ల ఎక్కువగా కేలరీలు బర్న్ అవుతాయి. దీంతో మీ గుండె ఆరోగ్యం మెరుగ్గా మారుతుంది.

సైక్లింగ్:

శరీరంలోని కండరాలపై ఎలాంటి ఎఫెక్ట్ పడకుండా, ఒత్తిడి లేకుండా చేసేందుకు సైక్లింగ్ ఓ బెస్ట్ వర్కౌట్. దీని వల్ల గుండెపోటు, కొన్ని క్యాన్సర్స్, డిప్రెషన్, షుగర్ వ్యాధి, అధిక బరువు, కీళ్ళనొప్పులు అనేక సమస్యలు దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. దీనిని కూడా ఎవరైనా ఎప్పుడైనా చేయొచ్చా. పైగా దీనిని చేయడం వల్ల పర్యావరణానికి చాలా మంచిది.

స్విమ్మింగ్:

స్విమ్మింగ్ చేయడం కూడా ఓ బెస్ట్ వర్కౌట్. దీనిని చేయడం వల్ల ఒత్తిడి తగ్గి.. పోశ్చర్ మెరుగ్గా మారుతుంది. స్విమ్మింగ్ చేయడం వల్ల కేలరీలు తగ్గిపోతాయి. వీటితో పాటు కోర్ కండరాలు బలంగా మారుతుంది. ఇక బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించేందుకు స్విమ్మింగ్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. దీనిని చేయడం వల్ల అప్పర్ బాడీ ఫిట్‌గా మారుతుంది.

పవర్ యోగా:

కేలరీలను బర్న్ చేయడంలో పవర్ యోగా ది బెస్ట్. దీనిని చేయడం వల్ల జీవక్రియ కూడా మెరుగ్గా మారుతుంది. వీటిని చేయడం వల్ల బరువు తగ్గుతాయి. దీనిని చేయడం వల్ల బరువు తగ్గడమే కాకుండా గుండె ఆరోగ్యం, ఊపిరితిత్తులను మేలు చేస్తాయి. దీంతో పాటు హైబీపీ, రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.

Also Read:  Foods: రక్తంలో కొలెస్ట్రాల్, షుగర్ లెవెల్స్ తగ్గాలంటే ఇలాంటి ఆహారం తినాల్సిందే