Winter Food : చలికాలంలో వచ్చే సమస్యలకు ఈ ఆహరం తీసుకోండి..

చలికాలంలో చర్మం పొడిబారడం జరుగుతుంది. అయితే దానిని తగ్గించడం కోసం మనం అనేక రకాల క్రీములు వాడుతుంటాము.

  • Written By:
  • Publish Date - November 22, 2023 / 07:00 PM IST

చలికాలం(Winter) రాగానే ఎవరైనా తొందరగా ఇన్ఫెక్షన్లకు గురవుతుంటారు. చలి వలన మన శరీరంలో వేడి కూడా తగ్గుతుంది. దోమల బెడద చలికాలంలో ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో చర్మం పొడిబారడం జరుగుతుంది. జుట్టు రాలడం కూడా ఎక్కువగా జరుగుతుంది. చలికాలంలో రోగనిరోధక శక్తి కూడా తక్కువగా ఉంటుంది. వీటన్నిటిని చలికాలంలో తీసుకునే ఆహారంతో(Food) దూరం పెట్టొచ్చు.

చలికాలంలో మనం తినే ఆహారంలో విటమిన్ ఎ, విటమిన్ సి ఉండేలా చూసుకోవాలి. ఇవి ఎక్కువగా ఉన్న ఆహారపదార్థాలను తినడం వలన మనలో రోగనిరోధక శక్తి పెరిగి తొందరగా అనారోగ్యానికి గురి కాకుండా ఉంటారు. పాలకూరలో విటమిన్ ఎ, విటమిన్ సి మరియు యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చలికాలంలో వారానికి ఒకసారి అయిన పాలకూర తినడం మన ఆరోగ్యానికి మంచిది.

చలికాలంలో చర్మం పొడిబారడం జరుగుతుంది. అయితే దానిని తగ్గించడం కోసం మనం అనేక రకాల క్రీములు వాడుతుంటాము. దీని వలన మనకు ఎప్పటికైనా హాని కలుగుతుంది. కాబట్టి మనం అవకాడో తినడం వలన మన చర్మం పొడి బారడం తగ్గుతుంది. మన చర్మం మెరుస్తూ కనబడుతుంది.

క్యారెట్లు, చిలకడ దుంపలు, చేపలు వీటిలో విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. చలికాలంలో మనం నీటిని తక్కువగా తాగుతుంటాము. కానీ చలికాలంలో కూడా మనం మన శరీరానికి తగిన నీటిని అందించాలి. లేకపోతే మన శరీరం డీ హైడ్రాషన్ కి గురవుతుంది. దీనికోసం కీర దోసకాయని తినొచ్చు. కాబట్టి మనం చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలి అంటే ముఖ్యంగా మనం తినే ఆహారాన్ని బట్టే ఉంటుంది. ఆహారంలో జాగ్రత్తలు తీసుకుంటే ఈ చలికాలంలో కూడా మనం ఆరోగ్యంగా ఉండవచ్చు.

 

Also Read : Cough – Cold : చలికాలంలో వచ్చే జలుబు, దగ్గు వంటివి తగ్గడానికి.. ఈ ఇంటి చిట్కాలు పాటించండి..