Winter Hair Care Tips: శీతాకాలంలో జుట్టు తరచుగా పొడిగా, నిర్జీవంగా మారుతుంది. చల్లటి గాలి వల్ల జుట్టులో తేమ తగ్గి చుండ్రు సమస్య (Winter Hair Care Tips) కూడా పెరుగుతుంది. ఇటువంటి పరిస్థితిలో కలబందలో కొన్ని పదార్థాలను మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయడం ద్వారా చుండ్రు నుండి బయటపడవచ్చు. ఈ విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
కలబంద- నిమ్మరసం
నిమ్మకాయలో చుండ్రుకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేసే క్రిమినాశక గుణాలు ఉన్నాయి. కలబంద, నిమ్మరసం మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయడం వల్ల చుండ్రు తగ్గి జుట్టు మెరుపు పెరుగుతుంది.
అలోవెరా- పెరుగు
పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చుండ్రును తగ్గించడంలో సహాయపడుతుంది. కలబంద-పెరుగును మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయడం వల్ల స్కాల్ప్ కు తేమ అందుతుంది. చుండ్రు నుండి విముక్తి పొందుతుంది.
Also Read: Rythu Panduga : పాలమూరుకు ఏం చేసావని కేసీఆర్‌ను ప్రశ్నించే హక్కు మీకెక్కడిది – హరీష్ రావు
అలోవెరా- కొబ్బరి నూనె
కొబ్బరి నూనె జుట్టుకు పోషణనిస్తుంది. చుండ్రును తగ్గిస్తుంది. కలబంద- కొబ్బరి నూనె మిశ్రమంతో జుట్టుకు మసాజ్ చేయడం వల్ల స్కాల్ప్ ఆరోగ్యంగా ఉంటుంది. జుట్టు మృదువుగా, నిగనిగలాడుతుంది.
అలోవెరా- టీ ట్రీ ఆయిల్
టీ ట్రీ ఆయిల్‌లో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చుండ్రును తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి. అలోవెరా- టీ ట్రీ ఆయిల్‌ను మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయడం వల్ల దురద, మంట సమస్య నుండి కూడా ఉపశమనం లభిస్తుంది.
కలబంద- తేనె
తేనెలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇది జుట్టు దెబ్బతినకుండా కాపాడుతుంది. కలబంద- తేనె మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు మృదువుగా, మెరుస్తూ ఉంటుంది. చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది.