Site icon HashtagU Telugu

White Bedsheets : హోటల్స్‌లో వైట్ కలర్ బెడ్ షీట్స్, పిల్లో కవర్స్ ఎందుకు వాడతారో మీకు తెలుసా?

Why White Bed Sheets and White Pillow Covers used in so Many Hotels

Why White Bed Sheets and White Pillow Covers used in so Many Hotels

మనం ఈ రోజుల్లో ఏ ఊరు వెళ్లినా లేదా ఏదయినా పని మీద ఎక్కడికైనా వెళ్ళినప్పుడు హోటల్స్ లో ఉంటాము. అయితే మనం అక్కడ హోటల్స్ లో(Hotels) అబ్జర్వ్ చేస్తే ఎక్కువగా వైట్ కలర్ బెడ్ షీట్స్(White Bedsheets), పిల్లో కవర్స్(Pillow Covers) వాడతారు. ఎందుకంటే మనం హోటల్స్ రూమ్స్ లోకి ట్రావెలింగ్ చేసి వస్తాము, లేదా పని మీద వస్తాము. వైట్ కలర్స్ బెడ్ షీట్స్ వాడడం వలన ఎంతో రిలాక్స్ గా ఫీల్ అవుతారు. ఇంకా హోటల్స్ వాళ్లకి వైట్ కలర్ బెడ్ షీట్స్ వాడడం వలన ఎక్కడ మురికిగా అయ్యాయో తొందరగా తెలుస్తుంది. అదే రకరకాల కలర్స్ వి బెడ్ షీట్స్ వాడితే అవి ఎక్కడ మురికి అయ్యాయో తొందరగా తెలియదు. కాబట్టి వైట్ బెడ్ షీట్స్ వాడడం వలన బెడ్ షీట్స్ క్లీన్ చేసి పెట్టడం హోటల్స్ వారికి తేలిక అవుతుంది.

1990 ముందు వరకు వైట్ కలర్ బెడ్ షీట్స్ ఎక్కువగా ఉపయోగించేవారు కాదు. 1990 తరువాత ఇంటీరియర్ డిజైనర్స్ వైట్ కలర్ బెడ్ షీట్స్, పిల్లో కవర్స్ వాడమని హోటల్స్ వాళ్లకు సజెస్ట్ చేశారు. అప్పటి నుండి కొన్ని హోటల్స్ వాళ్ళు వైట్ కలర్ బెడ్ షీట్స్, పిల్లో కవర్స్ వాడడం మొదలుపెట్టారు. వాళ్ళని చూసి మిగతా వాళ్ళు కూడా వైట్ కలర్ బెడ్ షీట్స్, పిల్లో కవర్స్ వాడడం మొదలుపెట్టారు.

ఇప్పుడు అయితే 3 స్టార్, 5 స్టార్ హోటల్స్ లో వారు అతిథులు తమ ఇష్టానికి అనుగుణమైన కలర్స్ ఎంచుకొని కస్టమైజ్ చేయించుకునే అవకాశం ఇస్తున్నారు. ఇలా చేయడం వలన అతిథులు తమకు నచ్చినట్లుగా హోటల్స్ లో నివసిస్తారు. ప్రస్తుతం ఇది ఇంకా ట్రయిల్ ప్రాసెస్ లో ఉన్నా 90 శాతం హోటల్స్ లో ఇంకా వైట్ కలర్ బెడ్ షీట్స్, పిల్లో కవర్స్ నే వాడుతున్నారు. కావాలంటే ఈసారి హోటల్ కి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేయండి మీకే తెలిసిపోతుంది.

 

Also Read : Sweet Potato Benefits: వామ్మో చిలగడదుంప వల్ల ఏకంగా అన్ని రకాల ప్రయోజనాలా?