Site icon HashtagU Telugu

Bindi Stickers : ఆడవాళ్లు మీ ఫేస్ ని బట్టి ఏ స్టిక్కర్(బిందీ) పెట్టుకుంటే బాగుంటుందో మీకు తెలుసా?

Which type of Bindi Stickers best for your face know about it

Which type of Bindi Stickers best for your face know about it

మన ముఖం అందంగా మరియు ఆకర్షణీయంగా ఉండడానికి మనం పెట్టుకునే స్టిక్కర్(Sticker) ని బట్టి కూడా ఉంటుంది. కొంతమంది గుండ్రనివి, కొంతమంది నిలువువి, మరికొంతమంది స్టోన్స్ స్టిక్కర్స్(Bindi) పెట్టుకుంటూ ఉంటారు. ఈ విధంగా స్టిక్కర్స్ ని పెట్టుకోవడం వలన మన ముఖంలో తేడా అనేది తప్పకుండా కనబడుతుంది. అయితే మన ఫేస్ కట్ ని బట్టి మనం ఎటువంటి స్టిక్కర్ బాగుంటుందో తెలుసుకొని పెట్టుకుంటే మనం ఇంకా ఆకర్షణీయంగా కనబడతాము.

మన ముఖం రౌండ్ గా ఉన్నట్లైతే రౌండ్ షేప్ వి కాకుండా నిలువుగా ఉన్న స్టిక్కర్స్ పెట్టుకుంటే అందంగా ఆకర్షణీయంగా కనబడతాము. అదే మన ముఖం డైమండ్ షేప్ లో ఉన్నట్లైతే డిజైన్ ఉన్నవి కాకుండా రౌండ్ గా ఉన్నవి లేదా సింపుల్ గా ఉన్న స్టిక్కర్స్ ని పెట్టుకుంటే ఎంతో ఆకర్షణీయంగా కనబడతాము. ఓవెల్ షేప్ ముఖం ఉన్నవారు నుదురు, గడ్డం పొడవుగా ఉంటాయి కాబట్టి గుండ్రంగా ఉన్నవాటిని పెట్టుకుంటే ఎంతో లుకింగ్ గా కనబడతారు.

చతురస్రాకారం ఫేస్ ఉన్నవారు రౌండ్ గా ఉన్నవి డిజైన్ వి లేదా చంద్రుని ఆకారంలో ఉన్నవి పెట్టుకుంటే ఎంతో బాగుంటారు. గడ్డం, నుదురు చదునుగా ఉన్నవారు రౌండ్ గా ఉన్నవి లేదా కొంచెం పొడుగ్గా ఉన్నవి పెట్టుకుంటే ఎంతో అందంగా ఆకర్షణీయంగా కనబడతారు. ఈ విధంగా మనం మన ముఖం షేప్ ని బట్టి ఎలాంటి స్టిక్కర్ పెట్టుకుంటే బాగుంటుందో దానిని పెట్టుకుంటే ఎంతో లుకింగ్ గా కనబడతాము. ఇలా మనం స్టిక్కర్స్ పెట్టుకోవడం వలన మనం చాలా అందంగా కనిపిస్తాము. అయితే కొన్ని స్టిక్కర్స్ మనం పెట్టుకున్న కాసేపటికే పోతుంటాయి అలా అయినట్లయితే వాటిని పెట్టుకునే ముందు నుదురుకు కొంచెం పౌడర్ రాసుకొని పెట్టుకుంటే తొందరగా స్టిక్కర్స్ ఊడిపోకుండా ఉంటాయి ఇంకా అందంగాను కనిపిస్తారు.

Also Read : Barefoot Benefits : చెప్పులు లేకుండా నడిస్తే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా ?