Site icon HashtagU Telugu

Blood Sugar Vs Dal : షుగర్ రోగులు ఏ పప్పు తింటే బెస్ట్ ?

Blood Sugar Vs Dal

Blood Sugar Vs Dal

Blood Sugar Vs Dal : షుగర్‌ వ్యాధి ఉన్నవారు ఏం తినాలన్నా తెగ ఆలోచిస్తుంటారు. కొందరైతే రెండు పూటలా చపాతీలే తింటుంటారు. చివరకు పప్పులు తినే విషయంలోనూ కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఈనేపథ్యంలో డయాబెటిస్ రోగులకు ఏ  పప్పు బెటర్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

ఇళ్లలో కందిపప్పు, పెసర పప్పు, ఎర్రపప్పు వినియోగం ఎక్కువగా ఉంటుంది. కందిపప్పు, ఎర్రపప్పులతో పోలిస్తే పెసర పప్పులో గ్లైసెమిక్ ఇండెక్స్‌ ఎక్కువగా ఉంటుంది. ఎర్రపప్పులో దీని శాతం కాస్త తక్కువ. గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉండే ఎర్రపప్పును షుగర్ రోగులు తీసుకోవడం మంచిది. రోజూ మధ్యాహ్న భోజనంలో అన్నం తక్కువగా, కర్రీ ఎక్కువగా తినాలి. ఈ కర్రీల్లో పప్పులను తీసుకోవచ్చు. అయితే పైన చెప్పిన ప్రకారం.. షుగర్ పేషెంట్స్ గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉన్న పప్పులను తీసుకోవాలి.

Also Read: Man On Pole : రైల్వే విద్యుత్ టవర్ ఎక్కేశాడు.. రెండు గంటలు ట్రైన్లు ఆపేశాడు

షుగర్ రోగులు రోజూ బ్రేక్ ఫాస్ట్‌లో ఉప్మా, బోండా, వడ, పూరి లాంటి వాటికి దూరంగా ఉంటే మంచిది. వీటికి బదులుగా ఫైబర్ ఎక్కువగా ఉండే ఓట్స్, క్వినో వా, దలియా ఉప్మా, రాగి జావ తీసుకోవాలి.  పండ్లను తింటే ఆరోగ్యానికి మంచిదే. షుగర్ వ్యాధిగ్రస్తులు ఫైబర్‌, ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాన్ని(Blood Sugar Vs Dal) తినాలి.  బీన్స్‌, గింజలు, విత్తనాలు, చేపలు, చికెన్‌, కోడి గుడ్లు తినొచ్చు.