Peanuts For Beauty: పల్లీలు తింటే అందం రెట్టింపు అవుతుందా.. ఇందులో నిజమెంత?

వేరుశెనగ విత్తనాలు.. వీటినే కొన్ని ప్రదేశాలలో పల్లీలు, శనగ విత్తనాలు అని కూడా పిలుస్తూ ఉంటారు. పల్లీలు ఆరోగ్యానికి ఎంతో మంచిది అన్న విషయ

  • Written By:
  • Publish Date - February 6, 2024 / 02:00 PM IST

వేరుశెనగ విత్తనాలు.. వీటినే కొన్ని ప్రదేశాలలో పల్లీలు, శనగ విత్తనాలు అని కూడా పిలుస్తూ ఉంటారు. పల్లీలు ఆరోగ్యానికి ఎంతో మంచిది అన్న విషయం మనందరికీ తెలిసిందే. తరచూ వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలను పొందవచ్చు. పల్లీలను ఎన్నో రకాల కూరల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే మీకు తెలుసా, పల్లీలు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఉపయోగపడతాయట.. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. పల్లీలను తరచుగా తింటూ ఉండటం వల్ల అందం రెట్టింపు అవుతుందట. మరి పల్లీలతో అందాన్ని ఎలా రెట్టింపు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

వేరుశనగలో కార్బోహైడ్రేట్స్‌, ఫైబర్‌, ప్రొటిన్లు, విటమిన్‌ సి, ఎ, బి6 ఫాస్ఫరస్, మెగ్నీషియం, సోడియం, క్యాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. వేరుశెనగలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. వీటిలో చర్మానికి అవసరమైన విటమిన్‌ ఇ, నియాసిన్, జింక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. వేరుశనగలోని విటమిన్‌ ఇ యాంటీఆక్సిడెంట్‌లా పని చేస్తుంది. ఇది ఫ్రీ రాడికల్స్‌ నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. వృద్ధప్య ఛాయలు త్వరగా రాకుండా కాపాడుతుంది. చర్మంపై ముడతలు, గీతలను నివారిస్తుంది. వేరుశనగలోని విటమిన్‌ ఇ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది యూవీ కిరణాల హానికరమైన ప్రభావాల నుంచి చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది.

పల్లీలలోని విటమిన్‌ బి6 యూవీ కిరణాలు, కాలుష్యం నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. వేరుశెనగలో ఉండే విటమిన్ కె, ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి డార్క్‌ సర్కిల్స్‌ తగ్గిస్తాయి. కంటి వలయాలు రాకుండా రక్షిస్తాయి. పల్లీలలోని నియాసిన్‌ రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది కళ్ల కింద నల్లటి వలయాలను, కళ్ల ఉబ్బరాన్ని కూడా నివారిస్తుంది. వేరుశనగలో జింక్ సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. కొల్లాజెన్ చర్మానికి అవసరం. దీంతో చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. చర్మంపై ముడతలు, నల్ల మచ్చలును నివారిస్తుంది. ఆరోగ్యకరమైన చర్మ కణాలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. ఇది కాలక్రమేణా చర్మం ముడతలు లేకుండా చేస్తుంది. వేరుశెనగలో ఫ్యాటీ యాసిడ్స్‌ మెండుగా ఉంటాయి. ఇవి చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతాయి. చర్మం పొడిబారకుండా కాపాడుతుంది. పిల్లీలలోని విటమిన్‌ సీ చర్మాన్ని కాంతివంతం చేస్తుంది, స్కిన్‌ పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది.