ఈ రోజుల్లో చిన్న పిల్లల దగ్గరి నుండి పెద్దవారి వరకు అందరూ బూట్లు ధరిస్తున్నారు. అందరూ మామూలుగా సాక్స్(Socks) వేసుకొని తరువాత షూస్(Shoes) వేసుకుంటారు. అయితే ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ అని ఎవరో ఒకరు ఏదో ఒకటి మొదలు పెడితే అది మంచిదా కాదా అని కాకుండా అందరూ దానినే ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఫ్యాషన్ గా ఎక్కువమంది సాక్స్ లేకుండా బూట్లు వేసుకుంటున్నారు కానీ ఇది మంచి పద్దతి కాదు. దీని వలన మనకు కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి.
మన పాదాలు సుమారు రోజుకు 300 ml చెమటను విడుదల చేస్తాయి. అయితే మనం సాక్స్ లేకుండా షూస్ వేసుకోవడం వలన పాదం దగ్గర ఉన్న చెమట షూ లోనే ఉండిపోతుంది. దీని వలన మన పాదాలు తేమ పెరుగుతుంది. దీని వలన బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఏర్పడతాయి. అదే సున్నితమైన చర్మం ఉన్నవారికైతే అలర్జీలు వచ్చే అవకాశం ఉంది. సాక్స్ లేకుండా బూట్లు ధరిస్తే రక్తప్రసరణను సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి.
అలాగే కాళ్ళ మీద దద్దుర్లు, దురదలు వచ్చే అవకాశం ఉంది.నడిచేటప్పుడు ఏదైనా దెబ్బ తగిలినా సాక్స్ లేకపోతే డైరెక్ట్ గా షూస్ నుంచి కాలికి ఎక్కువగా తగులుతుంది. నడిచేటప్పుడు సాక్స్ లలో ఇసుక, దుమ్ము, చిన్న చిన్న రాళ్లు పడటం సహజం. సాక్స్ లేకపోతే వీటి వలన కాళ్లకు ఇబ్బంది కలుగుతుంది . బూట్లు వేసుకునేటప్పుడు తప్పనిసరిగా సాక్స్ వేసుకోవాలి లేకపోతే పైన చెప్పిన సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.
పిల్లలకు బూట్లు వేసేటప్పుడు కూడా తప్పనిసరిగా సాక్స్ వేయాలి. పిల్లలు టైట్ గా ఉన్నాయి అని వద్దు అని అన్నా, వాటిని లూజ్ చేసి వాళ్ళ ఆరోగ్య దృష్ట్యా తప్పనిసరిగా సాక్స్ వేయాలి.
Also Read : Vitamin D: విటమిన్ డి లోపం వల్ల కలిగే ఇబ్బందులు ఇవే..!