Coconut Tips : లేత కొబ్బరితో మెరిసిపోయే అందాన్ని మీ సొంతం చేసుకోండిలా?

కొబ్బరి నీళ్లు (Coconut Water) తాగిన తర్వాత అందులో ఉండే లేత కొబ్బరిని చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడి తింటూ ఉంటారు.

Published By: HashtagU Telugu Desk
Want To Own The Glow Of Light Coconut..

Want To Own The Glow Of Light Coconut..

Benefits of using Coconut : కొబ్బరికాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కొబ్బరికాయలోని కొబ్బరి అలాగే కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలను చేకూరుస్తాయి. ముఖ్యంగా వేసవికాలంలో బెస్ట్ రిఫ్రెష్మెంట్ డ్రింక్ కొబ్బరి నీళ్ళు అని చెప్పవచ్చు. కొబ్బరి నీళ్ళ (Coconut Water) వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే ఆరోగ్యం బాగో లేనప్పుడు డాక్టర్లు ఎక్కువగా ఈ కొబ్బరినీళ్లు తాగమని చెబుతూ ఉంటారు. అయితే కొబ్బరి నీళ్లు తాగిన తర్వాత అందులో ఉండే లేత కొబ్బరిని చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడి తింటూ ఉంటారు. రుచి కూడా ఎంతో బాగుంటుంది. కాగా ఆ లేత కొబ్బరి కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుందట. మరి లేత కొబ్బరి (Coconut) అందానికి ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

లేత కొబ్బరి చర్మానికి అద్భుతమైన మాయిశ్చరైజర్‌. దీనిలో ఫ్యాటీ యాసిడ్స్‌ మెండుగా ఉంటాయి. ఇవి చర్మంలోని తేమను లాక్‌ చేయడానికి సహాయపడతాయి. లేత కొబ్బరి చర్మాన్ని మృదువుగా, హైడ్రేట్‌గా ఉంచుతుంది. లేత కొబ్బరిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా అడ్డుకుంటాయి. ముఖంపై ముడతలు, గీతలను తొలగించి యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. చర్మంపై మొటిమలు, దద్దుర్లు, మంటను తగ్గిస్తుంది. మొటిమల వల్ల కలిగే నొప్పి, చికాకును తగ్గిస్తుంది. లేత కొబ్బరిలో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు మెండుగా ఉంటాయి. ఇవి బ్యాక్టీరియా, ఫంగస్‌‌‌ వల్ల కలిగే చర్మ సమస్యలను చికిత్స చేయడంలో సహాయపడతాయి.

ఇది చర్మంపై హానికరమైన సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధిస్తుంది. లేత కొబ్బరిలో విటమిన్లు, మినరల్స్‌ మెండుగా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడతాయి. హెయిర్ ఫోలికల్స్‌కు పోషణనిస్తుంది, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. లేత కొబ్బరిలో యాంటీ ఫంగల్‌ గుణాలు ఉంటాయి. ఇవి ఫంగస్‌‌ కారణంగా ఎదురయ్యే చుండ్రు సమస్యను నియంత్రిస్తుంది. మీ చర్మానికి లేత కొబ్బరి అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయండి. 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరనిచ్చి ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే. చర్మం మృదువుగా మారుతుంది. అదేవిదంగా లేత కొబ్బరి పేస్ట్‌లో కొద్దిగా తేనె మిక్స్ చేసి మీ ముఖానికి అప్లై చేయాలి. దీన్ని 10 నుంచి 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి..

Also Read:  Eye Sight Tips : కంటిచూపు సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ డైట్ ఫాలో అవ్వాల్సిందే?

  Last Updated: 16 Dec 2023, 11:16 AM IST