Vegetarians : మనదేశంలో శాఖాహారం తినేవారు ఎంతమంది ఉన్నారో తెలుసా? శాఖాహారం వల్ల ప్రయోజనాలు..

ఇప్పుడు మన దేశంలో, ప్రపంచంలో ఎక్కువగా శాఖాహారం తినాలి అనుకునేవారు ఎక్కువ అవుతున్నారు.

  • Written By:
  • Publish Date - December 21, 2023 / 06:00 AM IST

మాంసాహారం(Non Veg) కంటే శాఖాహారం(Veg Food) మన ఆరోగ్యానికి, పర్యావరణానికి ఎంతో మంచిది. అందుకని ఇప్పుడు మన దేశంలో, ప్రపంచంలో ఎక్కువగా శాఖాహారం తినాలి అనుకునేవారు ఎక్కువ అవుతున్నారు. మాంసాహారానికి దూరంగా ఉంటున్నారు. అయితే ప్రపంచంలో శాఖాహారులు(Vegetarians )అధికంగా ఉన్న దేశం మన భారతదేశం.

దానికి మాంసాహారం మీద ఉన్న అయిష్టత లేదా వారి సాంప్రదాయం ఇలా ఏదయినా కారణం కావచ్చు. మన భారతదేశంలో 38 శాతం మంది శాఖాహారులు ఉన్నారు. అంటే దాదాపు 45 కోట్లకు పైగా మన దేశంలో శాఖాహారులు ఉన్నారు మన దేశంలో. మన దేశం తరువాత ఇజ్రాయిల్ దేశంలో శాఖాహారులు ఎక్కువగా ఉన్నారు. ఇజ్రాయిల్ లో 13 శాతం మంది శాఖాహారులు ఉన్నారు. ఇజ్రాయిల్ లో శాఖాహారులు పెరగడానికి ముఖ్య కారణం జుడాయిజం. ఈ మతపరమైన జీవనశైలి కారణంగా శాఖాహారులు ఎక్కువగా ఉన్నారు.

శాఖాహారం తినడం వలన రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మాంసాహారం తినడం వలన మన శరీరంలో ట్రై గ్లిజరైడ్స్ పెరిగి చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అది మన గుండెకు మంచిది కాదు. శాఖాహారం తినేవారికి డయాబెటిస్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు మాంసాహారానికి దూరంగా ఉంటే మంచిది. ఎందుకంటే మొక్కల ఆధారిత ఆహారం ఇంకా వాటిలో కొవ్వు, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి శాఖాహారం తినడం వలన మనం బరువు పెరుగము.

శాఖాహారం తినడం వలన అల్జీమర్స్, జ్ఞాపకశక్తి తగ్గడం వంటివి రాకుండా ఉంటాయి. శాఖాహారం తినడం వలన ఆరోగ్యకరంగా ఉంటారు. మాంసాహారం ఆధారిత ఆహారం కార్బన్ ఉద్గారాలను రెండున్నర్ర రెట్లు పెంచుతాయి. శాఖాహారం కార్బన్ ఉద్గారాలను పెంచదు. మనం శాఖాహారం తినడం వలన పర్యావరణానికి ఎటువంటి హాని కలుగదు.

 

Also Read : Control Anger : కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం ఎలాగో తెలుసా?