Site icon HashtagU Telugu

Dark Circles : డార్క్ సర్కిల్ తో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ ఆహారం కచ్చితంగా తీసుకోవాల్సిందే..

Troubled By Dark Circles.. But This Food Must Be Taken For Sure..

Troubled By Dark Circles.. But This Food Must Be Taken For Sure..

ప్రస్తుత రోజుల్లో స్త్రీ పురుషులు చాలా మంది డార్క్ సర్కిల్స్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో ఈ సమస్య ప్రధాన సమస్యగా మారిపోయింది. అయితే ఈ డార్క్ సర్కిల్స్ (Dark Circles)ని తగ్గించుకోవడానికి చాలా మంది అనేక రకాల చిట్కాలను బ్యూటీ ప్రోడక్ట్ లను ఉపయోగిస్తూ ఉంటారు. ఈ డార్క్‌ సర్కిల్స్‌ (Dark Circles) రావడానికి చాలా కారణాలు ఉంటాయి. నిద్ర సరిగ్గా లేకపోవడం, ఎక్కువ సమయం కంప్యూటర్‌, ఫోన్‌ చూడటం, టీవీ ఎక్కువగా చూడటం, కెఫిన్‌ డ్రింక్స్ ఎక్కువగా తాగడం, ఎక్కువ ఒత్తిడికి గురికావడం, పోషకాహార లోపం కారణంగా కంటి కింద వలయాలు వస్తాయి.

డార్క్‌ సర్కిల్స్‌ (Dark Circles) కారణంగా ముఖం అందవిహీనంగా మారుతుంది, కళ్లు అలసటగా కనిపిస్తాయి. చాలమంది వీటిని కవర్‌ చేయాడనికి మేకప్‌ వాడతూ ఉంటారు. కేవలం బ్యూటీ ప్రోడక్ట్ లు హోమ్ రెమిడీలు మాత్రమే కాకుండా కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కూడా ఈ డార్క్ సర్కిల్స్ సంబంధించిన దూరం చేసుకోవచ్చు. మరి ఎటువంటి పదార్థాలను చూసుకుంటే డార్క్ సర్కిల్స్ సమస్య ఉండదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re Now on WhatsApp. Click to Join.

విటమిన్ ఎ లో యాంటీ ఏజింగ్‌ గుణాలు మెండుగా ఉంటాయి. ఇది చర్మం స్థితిస్థాపకతను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ముడతలు, నల్లటి వలయాలు, చర్మ అలెర్జీలకు వ్యతిరేకంగా పోరాడటానికి తోడ్పడుతుంది. మీరు విటమిన్‌ ఏ సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకుంటే డార్క్‌ సర్కిల్స్‌ సమస్య దూరం అవుతుంది. మీ డైట్‌లో విటమిన్‌ ఏ పుష్కలంగా ఉంటే క్యాప్సికమ్‌, మామిడి, బొప్పాయి, పాలకూర, క్యారెట్, ఆకుకూరలు, గుడ్లు, చేపనూనె, పాలు, గుమ్మడి పండు, జామ పండు, చీజ్‌ చేర్చుకోండి.​ అలాగే విటమిన్ సి కూడా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది రక్త నాళాలను మరింత బలపరుస్తుంది. ఇది కణాలలో రక్తం, ఆక్సిజన్ ప్రసరణను మెరుగుపరుస్తుంది. మీ చర్మాన్ని సహజంగా మెరుపిస్తుంది. మీ డైట్‌ సిట్రస్‌ జాతికి చెందిన నిమ్మ, ఉసిరి, జామకాయలు, టమాటా, బెర్రీలు, ఆకుకూరలు చేర్చుకోవాలి..

విటమిన్ ఇ కళ్ల కింద ఎరుపు, ముడతలు, ఉబ్బు వంటి సమస్యలు రాకుండా రక్షిస్తుంది. దీనిలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని కారణంగా కణాల నష్టాన్ని నిరోధిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడి డార్క్‌ సర్కిల్స్‌కు దారితీస్తుంది. మీ డైట్‌లో విటమిన్‌ ఈ సమృద్ధిగా ఉండే.. సోయా చిక్కుడు, పత్తి గింజల నూనె, గోధుమ, చిలగడ దుంపలు, పొద్దు తిరుగుడు గింజల నూనె, బాదం, వాల్‌నట్‌, చియా సీడ్స్‌, అవిసె గింజలు చేర్చుకోండి. డార్క్‌ సర్కిల్స్‌ రావడానికి రక్తహీనత కూడా ఒకే కారణం. మన శరీరంలో ఐరన్‌ లోపం కారణంగా హిమోగ్లోబిన్‌ తక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇది కళ్ల కింద మృదువుగా ఉండే చర్మాన్ని ప్రభావితం చేస్తుంది. చికెన్, చిక్కుళ్లు, శనగలు, ఉలవలు, రాజ్మా, సోయాబీన్స్, పప్పులతో పాటు పాలకూర, తోటకూర వంటి ఆకుకూరల్లో ఐరన్‌ అధికంగా లభిస్తుంది.

Also Read:  New iPhone: రూ. 50 వేల కంటే తక్కువ ధరలో యాపిల్ న్యూమోడల్‌ ఫోన్.. ఫీచర్స్ మాములుగా లేవుగా?