Tomato For Face: మొటిమల సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే టమోటాతో ఇలా చేయాల్సిందే?

  • Written By:
  • Publish Date - February 18, 2024 / 02:00 PM IST

ఈ రోజుల్లో చాలామంది యువత ముఖంపై మొటిమలు వాటి తాలూకా నల్లటి మచ్చల సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. వీటి కారణంగా ముఖం అంద విహీనంగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు ఈ విషయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు పాటించడంతో పాటు బ్యూటీ పార్లర్ ల చుట్టూ తిరిగి వేలకు వేలు ఖర్చు చేస్తూ ఉంటారు. చాలా మంది ముఖం కాంతివంతంగా మారడం కోసం ఎన్నో చిట్కాలు పాటిస్తుంటారు. క్రీములు, పేస్టులు వాడతారు కానీ ఎన్ని వాడినా ముఖంపై మొటిమలు పోకపోవడంతో తీవ్రంగా బాధపడుతూ ఉంటారు. అయితే ముఖంపై మొటిమలు ఉన్నవారు టమోటాతో కొన్ని సింపుల్ చిట్కాలను ఫాలో అయితే ఆ సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చు అంటున్నారు నిపుణులు.

ఇంతకీ ఆ చిట్కాలు ఎంతో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. టమాటా సహాయంతో అనే చర్మ సమస్యల్ని దూరం చేయవచ్చు. దీనిలోని న్యూట్రియంట్లు, పొటాషియం, విటమిన్‌ సి చర్మ సమస్యలన్నింటికీ చెక్‌ పెడతాయి. దీనిలో పెద్ద మొత్తంలో ఉండే లైకోపిన్‌ వృద్ధాప్య ఛాయల్నే కాదు గుండె వ్యాధుల్నీ దరి చేరనివ్వదు. బ్లాక్‌హెడ్స్ సమస్యతో బాధపడేవారికి టమాటా సహాయపడుతుంది. చర్మంపై ఉండే ఆయిల్‌ను టమాటా తొలగిస్తుంది. టమాటాను సగం కట్‌ చేసి ఒక ముక్కతో ముఖంపై నెమ్మదిగా రుద్దాలి. ఇలా చేస్తే టమాటా జ్యూస్‌ చర్మంలోనికి వెళ్తుంది. ఆ తర్వాత పదిహేను నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా రోజూ చేస్తే బ్లాక్‌ హెడ్స్‌ సమస్య దూరమవుతుంది. ట్యాన్‌ సమస్య అందరూ ఫేస్‌ చేస్తూ ఉంటారు.

ఎండ పడిన చర్మ భాగాల్లో నల్లగా మారిపోతుంటుంది. ట్యాన్‌ పడితే ముఖం నిగారింపు పోతుంది. ట్యాన్‌ను వదిలించుకోవాలంటే టమాటా గుజ్జుకు తేనె కలిపి ముఖంపై, ట్యాన్‌ ఉన్న ప్రాంతాల్లో అప్లై చేసి ఆ తర్వాత మసాజ్‌ చేయాలి. ఆ తర్వాత పదిహేను నిమిషాలు అలానే వదిలేసి, ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే పొడి చర్మం సమస్య కూడా దూరమవుతుంది. పింపుల్స్‌ సమస్యతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. మొటిమలను తొలగించడానికి టమాటా సహాయపడుతుంది. దీనిలో సహజమైన యాసిడ్స్‌, విటమిన్లు ఉన్నాయి. టమాటా రసాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. తర్వాత చల్లటి నీటితో కడిగేసుకుంటే మంచి రిజల్ట్‌ ఉంటుంది. ఇలా రోజూ చేస్తే సమస్య పూర్తిగా దూరమవుతుంది.

చాలా మంది ముఖం కడుక్కున్న కాసేపటి తర్వాత మళ్లీ జిడ్డుగా మారుతుంది. టమాటా ముఖంపై ఉన్న జిడ్డును తొలగించడానికి సహాయపడుతుంది. కాస్త టమాటా రసంలో కొంచెం నిమ్మరసం లేదా దోసకాయ రసం కలుపుకొని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రపరచుకుంటే ముఖంపై జిడ్డు తొలగి క్లీన్‌గా ఉంటుంది. టమాటా పాడైన చర్మాన్ని రిపేర్‌ చేస్తుంది. మీకు సన్‌ బర్న్‌ సమస్య ఉంటే టమాటా సహాయపడుతుంది. టమోటాలో విటమిన్ సి, విటమిన్ ఎ సమృద్ధిగా ఉంటాయి. ఇది చర్మానికి రాస్తే ఫ్రేష్‌గా ఉంటుంది. టమోటా జ్యూస్‌లో కొంచెం మజ్జిగ కలిపి చర్మానికి అప్లై చేయాలి. ఇలా చేస్తే సన్‌బర్న్‌ దూరమవుతుంది. చర్మంపై ఉండే వేడిని తగ్గించి చర్మాన్ని రిపేర్‌ చేస్తుంది.

అలాగే టమాటాతో మీ రంగును కూడా పెంచుకోవచ్చు. టమాటా షుగర్‌ స్క్రబ్‌తో మీ చర్మాన్ని మిలమిల మెరిపించవచ్చు. దీన్ని తయారు చేయడానికి ముందుగా రెండు నిమ్మకాయలు తీసుకుని తొక్కతో పాటుగా బ్లెండ్ చేయాలి. అయితే ఇలా బ్లెండ్ చేసేటప్పుడు రెండు ఐసు ముక్కలు కూడా వేయాలి. అలానే అందులో ఇరవై పుదీనా ఆకులు, రెండు టమాటాలు, ఐదు స్పూన్న పంచదార వేసి గ్రైండ్‌ చేయాలి. ఈ స్క్రబ్‌ని మీ ముఖానికి, చేతులకు, మెడకు అప్లై చేసుకోవాలి. వారానికి రెండు సార్లు ఈ చిట్కా ఫాలో అయితే, అందమైన చర్మం మీ సొంతమవుతుంది. మీ ముఖం తెల్లగా మారుతుంది.