Holi Tips: హోలీ వేళ రంగులు నుంచి చర్మం, జుట్టు, గోళ్ళకు రక్షణనిచ్చే టిప్స్..

హోలీ.. రంగుల పండగ. దీన్ని వసంత ఋతువు ఆగమనానికి సూచికగా పౌర్ణమి రోజున జరుపుకుంటారు.

హోలీ (Holi) రంగుల పండగ. దీన్ని వసంత ఋతువు ఆగమనానికి సూచికగా పౌర్ణమి రోజున జరుపుకుంటారు. చలికాలం ముగిసి ఎండాకాలం ఆరంభానికి ఇది నాంది లాంటిది. దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో హోలీ ఒకటి. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను.. హోలీ, కాముని పున్నమి, డోలికోత్సవం అని కూడా అంటారు. ఈ పండుగను స్నేహితులు , కుటుంబ సభ్యులు అందరూ కలిసి తమ కష్టాలను మరచిపోయి జరుపు కుంటారు. ఈ ఏడాది హోలీ (Holi) పండుగను మార్చి 8న జరుపుకోనున్నారు. హోలీ రంగులు, కలర్ స్ప్రేల నుంచి రక్షణ కోసం పాటించాల్సిన చిట్కాలు ఇప్పుడు తెలుసుకుందాం..

హోలీ (Holi) ఆడే ముందు..

హోలీని ఆడే ముందు.. మీ చర్మానికి, వెంట్రుకలకు నూనె రాసుకోవటం మంచిది. ఎవరైనా రసాయనాలతో నిండిన రంగులను ఉపయోగిస్తే, ఆ నూనె మీ చర్మానికి రక్షణ పొరలా పనిచేస్తుంది. నూనె జుట్టు , చర్మంపై జిడ్డుగల రక్షణ పొరను సృష్టిస్తుంది. ఈ పొర జుట్టు, మన చర్మం యొక్క ఫోలికల్స్‌లో రంగులు చొరబడకుండా అడ్డంకిగా పనిచేస్తాయి. ఆయిల్ ఆధారిత లేయర్ ను హోలీ వేడుకల తర్వాత రంగును సులభంగా కడుక్కో వడానికి వీలుంటుంది. మీ చర్మాన్ని కొబ్బరి, ఆలివ్, బాదం, ఇతర నూనెల నుండి ఎంచుకోవటం మంచిది. ఈ నూనెలు మీ చర్మాన్ని రక్షించడమే కాకుండా పోషణ , హైడ్రేట్ గా పని చేస్తాయి.

హోలీ (Holi) తర్వాత..

హోలీ తర్వాత సహజ సబ్బులతో స్నానం చేయడం మంచిది. ఎందుకంటే హెర్బల్ సబ్బులు రంగును సున్నితంగా తొలగించడమే కాకుండా చర్మానికి పోషణను అందిస్తాయి. గంధం , పసుపుతో చేసిన సబ్బులు, కుంకుమపువ్వుతో కుంకుమది నూనె, యాక్టివేటెడ్ చార్‌కోల్, తేనె , బాదం నూనెతో చేసిన సబ్బులు హోలీ తర్వాత ఉపయోగించడానికి ఉత్తమమైన సోప్స్ గా చెప్పవచ్చు. అవి మీ చర్మాన్ని పునరుజ్జీవింప జేస్తాయి. జుట్టుకు బాగా నూనె రాసి హోలీ ఆడండి. ఆ తర్వాత తలస్నానం చేసేస్తే రంగులు త్వరగా వదిలిపోతాయి. నూనె రాయకపోతే మాడుకు అంటుకున్న రంగుల వల్ల జుట్టు పొడిబారుతుంది.

ఈ చిట్కాలు ఫాలో అవ్వండి..

  1. ఎండలో హోలీ ఆడతారు కాబట్టి.. ఆటకు కనీసం 20 నిమిషాల ముందుగా సన్‌స్క్రీన్‌ అప్లయ్‌ చేయడం మంచిది. ఇది యూవీ కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది. ఎస్పీఎఫ్‌ శాతం 30 కన్నా ఎక్కువ మొత్తంలో ఉన్న సన్‌స్క్రీన్‌ మంచిది.
  2. సరిపడా మాయిశ్చరైజర్‌ని శరీరం మీద అప్లయ్‌ చేయడం ద్వారా చర్మం హైడ్రేట్‌ కాకుండా కాపాడుకోవచ్చు.
  3. గోళ్లకు నెయిల్‌ వార్నిష్‌లను రక్షణ కవచంగా ఉపయోగిస్తే రంగులు గోళ్లను పాడుచేయకుండా జాగ్రత్త పడొచ్చు.
  4. కంట్లో గాఢమైన రసాయనాలు కలిసిన రంగులు పడితే చూపునకు హానికరంగా పరిణమిస్తుంది. కంటికి రక్షణ అందించే కళ్లద్దాలు తప్పనిసరిగా వాడాలి. అయితే కాంటాక్ట్‌ లెన్స్‌ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వాడడం మంచిది కాదు.
  5. మనం ఎంతో మురిపెంగా చూసుకునే హెయిర్‌ స్టైల్‌ను కూడా పాడు చేసే శక్తి ఈ రంగులకు ఉంది. అలాగే తల మీద చర్మానికి కూడా హాని చేస్తాయి. అందుకని హెయిర్‌ని గట్టిగా దగ్గరకి అల్లి బన్‌ తరహాలో ముడేయాలి. తద్వారా వీలున్నంతగా నష్టాన్ని తగ్గించొచ్చు.
  6. ఎండ వేడికి హైడ్రేట్‌ అయిన చర్మం మరింత తేలికగా దుష్ప్రభావానికి లోనవుతుంది. కాబట్టి.. పండ్ల రసాలు, మంచి నీరు లేదా గ్లూకోజ్‌ వాటర్‌ బాగా తీసుకోవాలి.
  7. ఫుల్‌ నెక్‌ లేదా ఫుల్‌ స్లీవ్స్‌ ఉన్న దుస్తులు వినియోగిస్తే మంచిది. ఎంత వరకు వీలైతే అంత వరకు నేరుగా రంగులు చర్మాన్ని తాకకుండా జాగ్రత్తపడితే మంచిది.
  8. హోలీకి ముందుగా వ్యాక్స్‌ (వెంట్రుకలను తొలగించడం) చేయించుకోవద్దు. సున్నితంగా ఉన్న చర్మం మరింత త్వరగా రంగులప్రభావానికి గురవుతుంది.
  9. రంగుల్లో తడిసిన కారణంగా ఏదైనా అలర్జీ లాంటి రియాక్షన్‌ కలిగినట్టు గమనిస్తే… అలర్జీ సోకిన ప్రాంతాన్ని స్వచ్ఛమైన చల్లని నీటితో కడగాలి. అవసరాన్ని బట్టి సమీపంలోని చర్మ వైద్యులను సంప్రదించాలి.
  10. పండగ సందడి ముగిశాక, వీలైనంత త్వరగా సున్నితమైన క్లీన్సర్స్‌ను ఉపయోగించి చర్మంపై పేరుకున్న రంగుల్ని తొలగించుకోవాలి. దీనికి గాఢమైన ఆల్కలీ సబ్బులు లేదా షాంపులు వాడితే అవి మరింతగా చర్మంపై దుష్ప్రభావాన్ని చూపిస్తాయి.

Also Read:  Pizza: పిజ్జా తిని కూడా బరువు తగ్గొచ్చు? అది ఎలాగో తెలుసుకోండి.