Heart Attack: సుస్మితా సేన్ కు ట్రీట్మెంట్ చేసిన కార్డియాలజిస్ట్ టిప్స్: హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకునే లైఫ్ స్టైల్

ఇటీవల హార్ట్ ఎటాక్ ను ఎదుర్కొన్న తర్వాత ప్రముఖ నటి సుస్మితా సేన్ కీలక వ్యాఖ్యలు చేశారు. హార్ట్ ఎటాక్ అనేది కేవలం పురుషులకు సంబంధించిన ప్రాబ్లమ్స్..

ఇటీవల హార్ట్ ఎటాక్ (Heart Attack) ను ఎదుర్కొన్న తర్వాత ప్రముఖ నటి సుస్మితా సేన్ కీలక వ్యాఖ్యలు చేశారు. హార్ట్ ఎటాక్ అనేది కేవలం పురుషులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కాదని ఆమె అన్నారు. ఈనేపథ్యంలో సుస్మితా సేన్ కు వైద్యం అందించిన కార్డియాలజిస్ట్, డాక్టర్ రాజీవ్ భగవత్ హార్ట్ హెల్త్ పై ప్రజలకు కీలక సూచనలు చేశారు. మనం జీవనశైలిని ఆరోగ్యకరం చేసుకునేందుకు అనుసరించాల్సిన ముఖ్యమైన సందేశాలను ఆయన పంచుకున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఎంతోమంది యువకులు గుండెపోటుకు గురై చనిపోతున్నారు.. జిమ్ చేస్తున్నప్పుడు లేదా డ్యాన్స్ చేస్తున్నప్పుడు కూడా కొందరు వ్యక్తులు హార్ట్ ఎటాక్ (Heart Attack) తో చనిపోయిన వార్తలను మనం విన్నాం.. ఫిట్ నెస్ ఐకాన్ గా పేరొందిన నటి సుస్మితా సేన్ కూడా ఇటీవల హార్ట్ ఎటాక్ ను ఎదుర్కొన్నారు. ఆమె పరిస్థితే అలా ఉంటే.. ఫిట్ నెస్ పై దృష్టిపెట్టని వాళ్ళ గుండెలకు ఎంత గండం ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ గండం నుంచి బయటపడాలంటే మనం జీవనశైలిని బెటర్ చేసుకోవాలని కార్డియాలజిస్ట్ డాక్టర్ రాజీవ్ భగవత్ అంటున్నారు.

కార్డియాలజిస్ట్ డాక్టర్ రాజీవ్ భగవత్ సూచనలివీ..

  1. మధుమేహం, రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ధూమపానం వంటివి మన హృదయాలను చాలా ఒత్తిడికి గురిచేసే కొన్ని ప్రధాన కారకాలు. ఇవి ఉంటే వెంటనే అలర్ట్ కండి.
  2. శారీరక శ్రమను పెంచండి. వ్యాయామం చేయడం స్టార్ట్ చేయండి. అయితే వ్యాయామం వారానికి మూడు నుండి నాలుగు రోజులకు మించకూడదు. ఎందుకంటే.. జిమ్ చేశాక మీ శరీరం కోలుకోవడానికి కూడా సమయం కావాలి.
  3. మంచి నిద్ర షెడ్యూల్‌ను కలిగి ఉండండి. తగినంత నిద్రపోండి. ఏడు గంటల నుండి నిద్ర మరియు వ్యాయామానికి తగిన గ్యాప్ ఉండాలి.
  4. తెల్లవారుజామున 2 గంటలకు నిద్రపోవడం మరియు ఉదయం 6 గంటలకు జాగింగ్‌కు వెళ్లడం శరీరానికి అనువైనది కాదు. ఇది మీ ఆరోగ్యానికి ప్రమాదాన్ని కలిగిస్తుంది. మధుమేహం వచ్చే ముప్పును పెంచుతుంది.  నిద్రలేమి వల్ల షుగర్ వస్తుంది.
  5. విటమిన్ డి బాగా తీసుకోవాలి.అధిక కొలెస్ట్రాల్ , మధుమేహం వల్ల గుండెపోటుకు గురయ్యే ప్రమాదం పెరుగుతుంది. సూర్యరశ్మి విటమిన్ డి యొక్క ఉత్తమ మూలం. ఎల్లవేళలా ఇంట్లోనే ఉండడం ఆరోగ్యకరమైన పద్ధతి కాదు.
  6. రోజూ సమతుల్య, పౌష్టిక ఆహారం తీసుకోవాలి.

 

Also Read:  COVID-19: మళ్లీ కరోనా కలకలం.. 4 నెలల గరిష్టానికి కేసులు.. ఒకేరోజు 841 మందికి ఇన్ఫెక్షన్