Site icon HashtagU Telugu

ఈ ఆరు వస్తువులను వాషింగ్ మిషన్ లో వేస్తే అంతే సంగతులు.. అవేంటంటే?

Washing Machine

Washing Machine

మాములుగా మనం బట్టలను వాషింగ్ మిషన్ లో వేస్తూ ఉంటాం. మనిషి చేసే పనిని ఈ వాషింగ్ మిషన్ కాస్త సులువుగా చేసేస్తుంది. ఇటీవల కాలంలో బట్టలు ఉతికేవారి సంఖ్యతో పోల్చుకుంటే ఈ వాషింగ్ మిషన్ ఉపయోగించే వారి సంఖ్యనే ఎక్కువగా ఉంది. అయితే చాలామంది కొన్ని కొన్ని వస్తువులను కూడా వాషింగ్ విషయంలో వేస్తూ ఉంటారు. దానివల్ల వాషింగ్ మిషన్ పాడైపోవడం చెడిపోవడం, ట్రబుల్ ఇవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి. అలాగే వాషింగ్ మిషన్లో పొరపాటున కూడా ఆరు రకాల వస్తువులు వేయకూడదు అంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join
ఇంతకీ ఆరు రకాల వస్తువులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. దుప్పట్ల లాంటి బరువైన లాండ్రీని ఎప్పుడూ మామూలు బట్టలతో కలిపి లోడ్ చేయకూడదు. అన్ని లాండ్రీలను ఒకే లోడ్‌లో వేయడం లాంటివి అస్సలు చేయకూడదు. అలా చేస్తే లోడ్ ఎక్కువై మీ మెషిన్ దెబ్బతింటుంది. అలాగే లాండ్రీ కూడా సరిగా క్లీన్ అవ్వవు. మనం ఏం వేస్తున్నామనేది వాషింగ్ మెషిన్‌కి తెలీదు. సున్నితంగా ఉండే ఫోమ్ దిండును వాషింగ్ మెషిన్‌లో వేస్తే అది ఇట్టే చిరిగిపోతుంది. లోపల అల్లకల్లోలం అయిపోతుంది. వాషింగ్ మిషన్ పనిచేయడమే మానేస్తుంది. మంటలు వచ్చే అవకాశం ఉండే మరకలు బట్టలపై పడతే అంటే వంట నూనె, కిరోసిన్, గ్యాసోలిన్, మద్యం, పెట్రోల్, వంటివి బట్టలపై పడితే ఆ బట్టలను వాషింగ్ మెషిన్‌లో ఉతకడం మంచిది కాదు.

Also Read: Water Melon: పుచ్చకాయతో వీటిని కలిపి తింటున్నారా.. అయితే జాగ్రత్త?

వాటి వల్ల అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి. రెయిన్‌ కోట్‌లు వాటర్‌ ప్రూఫ్‌గా ఉంటాయి. అవి వాషింగ్ మెషిన్ లోపల నీటిని గ్రహించవు. రెయిన్‌ కోట్‌లు నీటిని బెలూన్‌లా బంధిస్తాయి. మెషిన్ వాటిని కడిగినప్పుడు అవి పగిలిపోయి భారీ గందరగోళం సృష్టిస్తాయి. అదేవిధంగా నాణేలు లేదా ఏదైనా లోహపు వస్తువును యంత్రంలో ఉంచరు. కానీ, ఇలా పొరపాటున జరిగితే, అది వాషింగ్ మెషిన్‌ను దెబ్బతీస్తుంది. అందుకే మెషిన్‌లో బట్టలు వేసే ముందు కచ్చితంగా బట్టల జేబులు చెక్ చేయాలి.

Also Read: Tuesday: పొరపాటున కూడా మంగళవారం రోజు చేయకూడని పనులు ఇవే?

Exit mobile version