Vastu Tips: వాస్తు ప్రకారంగా ఇల్లు నిర్మించడం లేదా.. అయితే కష్టాలను కొని తెచ్చుకున్నట్లే?

సాధారణంగా చాలామంది అనేక రకాల కలలు కంటూ ఉంటారు. అయితే వాటిలో సొంతింటి కల కూడా ఒకటి.

  • Written By:
  • Publish Date - September 22, 2022 / 08:20 AM IST

సాధారణంగా చాలామంది అనేక రకాల కలలు కంటూ ఉంటారు. అయితే వాటిలో సొంతింటి కల కూడా ఒకటి. చాలామంది ఇంటిని ఇంద్ర భవనంలో నిర్మించుకోవాలి అని కలలు కంటూ ఉంటారు. అయితే ఇల్లు కట్టడం పెద్ద విషయం కాదు కానీ ఆ ఇంటిని వాస్తు ప్రకారంగా నిర్మించారా లేదా అన్నది ప్రధాన విషయం. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఇంటిని నిర్మించే ముందు వాస్తు ప్రకారంగా ప్లానింగ్ వేసుకొని అదే విధంగా ఇంటిని నిర్మించుకుంటున్నారు. అయితే లక్షలు పెట్టి మరి ఇంటి నిర్మించుకున్నప్పుడు ఆ ఇంటిలో ఆనందంగా ఉండాలి అంటే తప్పకుండా వాస్తు ప్రకారంగా ఇంటిని నిర్మించుకోవాల్సిందే.

వాస్తు ప్రకారం గా ఇంటిని ఏ విధంగా నిర్మించుకోవాలి. లేదంటే ఎటువంటి పరిణామాలు జరుగుతాయి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..ఇంట్లో ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు ఉండాలి అనుకుంటే పూజగది ఈశాన్యంలో ఉండాలి. అలాగే వాస్తు ప్రకారం పూజా స్థలంలో ఎప్పుడూ పూర్వీకుల ఫొటోలు ఉండకూడదు. మరణించిన వారి ఫొటోలని ఎప్పుడు కూడా దక్షిణ దిశలోనే ఉంచాలి. వాస్తు ప్రకారం ఇంట్లో ఎక్కువ ఫోటోలు లేదా క్యాలెండర్లు ఉండకూడదు.

ఇంటి లోపల ఉన్న ప్రతికూల శక్తిని తొలగించడానికి ప్రతిరోజూ ఉదయం ఇంటి కిటికీ, తలుపులను కొంత సమయం పాటు తెరిచి ఉంచాలి. అదేవిధంగా వాస్తు ప్రకారం తులసి మొక్క ఇంటి ముందర ఉండాలి.అలాగే వృత్తిలో లేదా వ్యాపారంలో విజయం సాధించడానికి అరటి చెట్టును నాటాలి. వాస్తు ప్రకారం తాగునీరు ఎల్లప్పుడూ ఈశాన్య మూలలో ఏర్పాటు చేయాలి. వాస్తు ప్రకారం ఇంట్లో భూగర్భ నీటి ట్యాంక్, బోర్‌వెల్ లేదా చేతి పంపు ఏర్పాటు చేయాలంటే అది ఎల్లప్పుడూ ఉత్తరం లేదా ఈశాన్య దిశలో మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి.