Site icon HashtagU Telugu

Husband-Wife: భర్తలకు భార్యలు అస్సలు చెప్పకుండా దాచిపెట్టే విషయాలు ఇవేనట!

Secrets Women Keep From Men E13843212061661

Secrets Women Keep From Men E13843212061661

Husband-Wife: భార్యాభర్తల మధ్య ఎలాంటి సీక్రెట్ ఉండకూడదు. ఓపెన్ గా అన్నీ మాట్లాడుకున్నప్పుడు ఎలాంటి సమస్యలు ఉండవు. అలా కాకుండా మీకు సంబంధించి రహస్యాలు దాచిపెడితే భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో మీ సీక్రెట్స్ జీవిత భాగస్వామికి తెలిస్తే ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంటుంది. అందుకే పెళ్లితో ఒక్కటికాకముందు మీకు సంబంధించిన అన్ని విషయాలను ఒకరినొకరు పంచుకోవాలి.

ఒకరినొకరు అన్నీ పంచుకోవడం వల్ల జీవితంలో ఇబ్బందులు రావు. ఒకవేళ ప్రాబ్లమ్స్ వచ్చినా ఇద్దరూ అర్ధం చేసుకుని పరిష్కరించుకోవచ్చు. అయితే భర్తలు అన్నీ విషయాలు పంచుకున్నా.. భార్యలు మాత్రం కొన్ని విషయాలు భర్తలతో పంచుకోరట. ముఖ్యంగా మూడు విషయాలు మాత్రం భర్తకు అస్సలు చెప్పదట. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

భార్యలు ముఖ్యంగా అనారోగ్య సమస్యల నుంచి భర్తలకు చెప్పరట. అనారోగ్య సమస్యలు ఉన్నా సరే అలాగే పనిచేస్తూ ఉంటార. అలాగే డబ్బుల విషయం కూడా భర్తలకు భార్యలు ఎక్కువశాతం మంది చెప్పరట. డబ్బులను భార్యలు బాగా ఆదా చేస్తారు. ఎప్పుడు ఏం అవసరం వస్తుందో తెలియక ఆదా చేస్తూ ఉంటారు. అత్యవసర సమయాల్లో వీటిని భర్తలకు ఇస్తారు. ఇదే కాకుండా ఏ విషయంలోనైనా ఆందోళనకు గురైనా లేదా బాధ పడినా కొంతమంది భార్యలు భర్తలతో పంచుకోరు.

భర్తకు చెప్పడం ఇష్టంలేక అలాగే లోపల బాధపడుతూ ఉంటారు. బయటకు బాధను వ్యక్తపరచడానికి ఇష్టపడరు. కొంతమంది భార్య శృంగారపరమైన విషయాలను కూడా భర్తలతో షేర్ చేసుకోవడానికి ఇష్టపడరని చెబుతూ ఉంటారు.ఇలా అనేక విషయాలను భర్తలతో భార్యలు చేసుకోరట.ఇక వారి పుట్టింటికి సంబంధించిన విషయాలను కూడా ఎక్కువగా భర్తతో పంచుకోవడానికి భార్యలు ఇష్టపడరు.భార్యలు చెప్పకపోయినా భర్తలే గమనించి తెలుసుకోవాలని అంటున్నారు.