Guava Benefits : రోజు జామ పండు తినడం వల్ల జరిగే అద్భుతాలు ఇవే..!

జామ పండు ఆరోగ్యానికి (Health) ఎంతో మంచిది. డయాబెటిస్, క్యాన్సర్‌ని నిరోధించడంతో పాటు జీర్ణక్రియ,

జామ పండు (Guava) తియ్యగా ఉండే అద్భుతమైన ఫలం. ఈ పండుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. డయాబెటిస్‌తో పాటు పలు ఇతర వ్యాధులపై ఇది పోరాడుతుంది. దీనిని తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం..

జామ పండు ఆరోగ్యానికి ఎంతో మంచిది. డయాబెటిస్, క్యాన్సర్‌ని నిరోధించడంతో పాటు జీర్ణక్రియ, చర్మ ఆరోగ్యం, గుండె ఆరోగ్యాన్ని కూడా జామ పండు మెరుగుపర్చుతుంది. ఇందులో యాంటీ-ఆక్సిడెంట్లు, విటమిన్-సి, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. జామ పండు (Guava) ఎంతో రుచికరంగా ఉంటుంది. శీతాకాలంలో పుష్కలంగా లభిస్తుంది. ఇందులో జలుబు, జ్వరం నుంచి రక్షించే గుణాలున్నాయి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుందట. మరి జామ పండు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుకుందాం.

జామలో (Guava) ఉండే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో దోహదపడుతుంది. జామ తొక్కతో పాటు తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చు. జామ ఆకుల్లో టైప్ 2 డయాబెటిస్‌ని నియంత్రించే యాంటీ హైపెర్ గ్లైసెమిక్ లక్షణాలు ఉన్నాయని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. ఇది రక్తంలో చక్కెరను తగ్గించడానికి బాగా పని చేస్తుంది. జామలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందువల్ల వీటిని తింటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు.. జామ పండులో యాంటీ మైక్రో బియల్ ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి చెడు బ్యాక్టీరియా, వైరస్‌ లను చంపడానికి బాగా పని చేస్తాయి. ఇది జలుబు, ఫ్లూ లక్షణాలను కూడా తగ్గిస్తుంది.

జామ ఆకుల రసం క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తుందట. జామ ఆకులు క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయట. జామలో ఉండే యాంటీ-ఆక్సిడెంట్ ఫ్రీ రాడికల్స్ హానికరమైన క్యాన్సర్ కణాలను నిరోధిస్తాయని నిపుణులు చెబుతున్నారు. జామ ఆకు నూనెను అనేక క్యాన్సర్ మందులలో కూడా కలుపుతారు. ఇది క్యాన్సర్ అభివృద్ధిని నాలుగు రెట్లు వేగంగా అడ్డుకుంటుంది.

మీరు బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తుంటే జామ కాయను బెస్ట్ ఛాయిస్. ఒక జామ పండులో 37 కేలరీలు, 12 శాతం ఫైబర్ ఉంటుంది. ఇది విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండే తక్కువ కేలరీలు కలిగిన అల్పాహారం. పీచు ఎక్కువగా ఉండటం వల్ల జామ పండు ఎక్కువ సమయం పాటు కడుపును నిండుగా ఉంచుతుంది.  మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం కలిగించే డైటరీ ఫైబర్ జామ పండులో సమృద్ధిగా ఉంటుంది. గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. జామ్ పండును తీసుకుంటే.. అనేక ఉదర సంబంధ సమస్యలు కూడా తగ్గిపోతాయట.

Also Read:  Bathroom Tips : మీ బాత్‌రూమ్‌ లో ఎలిగెంట్‌ లుక్‌ కోసం ఈ టిప్స్‌ పాటించండి..!