Beauty Tips : మీ నుదురు ఆకృతికి ఎలాంటి బొట్టు పెట్టుకోవాలో తెలుసా..?

ఆడవారి అందం కట్టుబొట్టులోనే ఉంటుంది. చక్కగా చీరకట్టుకుని..మెడనిండా నగలు వేసుకుని...చేతినిండా గాజులు తొడుక్కొని...నుదుటి మీద బొట్టుపెట్టుకుంటే...ఆ అందాన్ని మాటల్లో వర్ణించలేము.

  • Written By:
  • Publish Date - June 25, 2022 / 09:30 AM IST

ఆడవారి అందం కట్టుబొట్టులోనే ఉంటుంది. చక్కగా చీరకట్టుకుని..మెడనిండా నగలు వేసుకుని…చేతినిండా గాజులు తొడుక్కొని…నుదుటి మీద బొట్టుపెట్టుకుంటే…ఆ అందాన్ని మాటల్లో వర్ణించలేము. మహిళలు అందరి దృష్టినీ ఆకర్షించేది వీటితోనే. నుదుటి మీద ఎర్రటి బొట్టు పెట్టుకుంటే…ముఖం ఎంతో అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కళ్లకు కాటుక, నుదుటికి బొట్టు చూడముచ్చటగా ఉంటుంది. మరి మీ నుదిటి ఆకారాన్ని బట్టి ఎలాంటి బొట్టుకుంటే అందం రెట్టింపు అవుతుందో తెలుసా…

* శరీరం రంగు, వేసుకునే దుస్తువుల రంగును బట్టి…ఎలాంటి బొట్టుపెట్టుకోవాలని డిసైడ్ అవ్వాలి. నుదురు ఆకృతిని బట్టి మీకు ఎలాంటి బొట్టు నప్పుతుందో తెలుసుకోవాలి. నుదురు చిన్నగా ఉంటే కొంచెం పొడవుగా ఉండే బొట్టు పెట్టుకుంటే…అందంగా కనిపిస్తారు.

* కొంతమంది నుదురు వెడల్పుగా ఉంటుంది. అలాంటివారు గుండ్రని బొట్టును పెట్టుకుంటే మరింత అందంగా కనిపిస్తారు. నుదురు పెద్దగా ఉంటే బొట్టును కనుబొమ్మల మధ్య కాకుండా కొంచెం పైకి పెట్టుకుంటే సూపర్ గా కనిపిస్తారు.

* ఇక శరీరాకృతిని, శరీర ఛాయను బట్టి కూడా బొట్టును ఎంపిక చేసుకోవచ్చు. అలా చేస్తే ముఖం అందంగా కనిపిస్తుంది. చామనఛాయ, అంతకన్నా కాస్తరంగు తక్కువగా ఉంటే ఆరెంజ్, పింక్, రెడ్ కలర్ బొట్టు అందంగా కనిపిస్తుంది.

* తెల్లని శరీరఛాయ కలిగిన ముదురురంగు బొట్టు మరింత ఆకర్షనీయంగా కనిపిస్తుంది. కళ్ళు పెద్దగా ఉంటే పెద్దబొట్టు…చిన్నగా ఉంటే చిన్న సైజు బొట్టు పెట్టుకుంటే చూడముచ్చగా ఉంటుంది.

* కళ్లు చిన్నగా ఉన్నవారు రకరకాల ఆకృతులు, మ్యాచింగ్ రంగుల బొట్లు పెట్టుకుంటే మరింత బాగుంటుంది. కానీ మధ్యవయస్సు వారికి రెడ్, పింక్ వంటి రంగులు చక్కగా నప్పుతాయి.

* ఇక చిన్నయవస్సు వారికి ఎలాంటి బొట్టు పెట్టుకున్నా నప్పుతుంది. ఇక మధ్యవయస్సు వారికి గుండ్రటి బొట్టు మాత్రమే నప్పుతుంది.