Site icon HashtagU Telugu

Summer Tan Problem : మామిడితో ట్యాన్ సమస్యలకు చెక్ పెట్టండిలా..!

Summer Tan Issues Clear With Mangoes Lifestyle

Summer Tan Issues Clear With Mangoes Lifestyle

Summer Tan Problem సమ్మర్ వచ్చింది అంటే ట్యాన్ సమస్య బాధిస్తుంది. సమ్మర్ కు మాక్సిమం బయటకు వెళ్లకుండా ఉండటమే బెటర్ కానీ వృత్తి రీత్యా బయటకు వెళ్లాసి రావడం.. ఎండ వేడి ముఖం నల్లగా మారడం తెలిసిందే. ఈ ట్యాన్ సమస్యల వల్ల చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. ట్యాన్ రాకముందే వేసివలో బయటకు వెళ్లినా ఎండ ముఖం మీద పడకుండా జాగ్రత్త పడితే బెటర్.

ఇక ట్యాన్ వచ్చిన వారు మామిడి పండు గుజ్జుతో ఆ సమస్య నుంచి ఈజీగా బయటపడొచ్చు. వేసవి తాపం వల్ల ఒంట్లోనే కాదు చర్మం మీద కూడా నల్లటి మచ్చలు ట్యాన్ సమస్యలు వస్తుంటాయి. వాటికి చెక్ పెట్టేలా మామిడి పండు ఉపయోపడుతుంది. సమ్మర్ లో మామిడి పండ్లు తినేందుకే కాదు ఆరోగ్య ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది.

సమ్మర్ హీట్ వల్ల ట్యాన్ సమస్యలు ఏర్పడతాయి. అయితే మామిడి గుజ్జుతో వాటిని తగ్గించవచ్చు. శనగపిండికి మామిడి గుజ్జు దానితో పాటు బాదం పప్పుల పొడి కొద్దిగా తేనే కలిపితే ఆ మిశ్రమ ముఖానికి అప్లై చేస్తే ఎండ తీవ్రత వల్ల ఏర్పడ్డ నల్లటి మచ్చలు, ట్యాన్ ను తొలగించి కాంతివంతమైన చర్మాన్ని ఏర్పరచుకోవచ్చు.

కేవలం ట్యాన్ కోసమే కాదు ముఖం సౌనర్యవంతంగా మారేందుకు మామిడి గుజ్జు ఉపయోగిస్తారు. ముల్తాని మట్టితో మామిడి గుజ్జి కలిపి ముఖానికి అప్లై చేస్తే చర్మం మృదువుగా మారుతుంది. అంతేకాదు ఎంతో అందంగా తయారవుతుంది. ఏడు ఎనిమిది బాదం పప్పులను నాన బెట్టి పొట్టు తీసి ఆ పేస్ట్, రెండు స్పూన్ల పాలు, కొద్దిగా ఓట్స్, ముల్తాని మట్టి, మామిడి పండు గుజ్జు వీటిని గ్రైండ్ చేసి వచ్చిన మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేస్తే ముఖం మరింత మెరిసిపోతుంది.

Also Read : Glass Items : మీకు తెలుసా.. గాజు పాత్రలను ఇలా క్లీన్ చేస్తే తలతలా మెరిసిపోతాయి..!