Snoring Tips: గురకతో ఇబ్బంది పడుతున్నారా?

వయసుతో (Age) సంబంధం లేకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న సమస్య గురక.

Published By: HashtagU Telugu Desk
Suffering from snoring?

Snorr

వయసుతో సంబంధం లేకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న సమస్య గురక (Snoring). గతంలో పెద్ద వారు అది కూడా నడి వయసులో ఉన్నవారు మాత్రమే గురక పెట్టేవారు. ఇప్పుడు చిన్నారులు సైతం గురక పెడుతున్నారు. ఇది సమస్యగా మారవచ్చు లేదంటే ఏదైనా అనారోగ్య సమస్యకు సూచనగా కూడా గురకను పరిగణించవచ్చు. గొంతులోని టిష్యూల ద్వారా గాలి పాస్ అయినప్పుడు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా పరిణమించి పెద్ద శబ్దంతో గురక వస్తుంది.

గురక (Snoring) అనేది 30 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్నవారిలో వస్తుంది. పురుషులలో అయితే 44 శాతం, స్త్రీలలో అయితే 28 శాతం మందిలో వస్తోంది. ఇక 60 ఏళ్ల పైబడిన వారిలో సగం మంది గురిక బారిన పడుతున్నారని రిసెర్చ్ సంస్థ వెల్లడించింది. నిజానికి గురక అనేది సరిగా నిద్ర సరిగా లేకపోవడం వల్ల కూడా వస్తుంది. నిద్ర నుంచి మాటిమాటికీ మెలుకువ రావడం, ఇబ్బందిగా ఫీలవడం తదితర సమస్యలు ముఖ్యంగా ఈ గురకకు కారణమవుతాయి.

ఇవి ఒక్కోసారి ప్రాణాంతకంగా కూడా పరిణమిస్తుంది. మరి గురకను నివారించడం ఎలా? అంటే ముందుగా బరువు తగ్గాలి. వ్యక్తి తన సాధారణ వెయిట్‌కు వచ్చేలా చూసుకోవాలి. ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు ఉన్నవారైతే వాటికి దూరంగా ఉండాలి. సాధారణ జీవనశైలి మార్పులు గురక నివారణకు సాయపడతాయి. ఇంకా ఇతర మార్గాలేమైనా ఉన్నాయా? అంటే.. దీనికి సంబంధించి కొన్ని ఎక్సర్‌సైజులు ఉంటాయి. అవి కూడా గురక నివారణకు సాయపడతాయి.

Also Read:  Imran Khan: ఇమ్రాన్ ఖాన్ ఇంటి వద్ద భారీ ఉద్రిక్తత

  Last Updated: 17 Feb 2023, 11:35 AM IST